Share News

ఆన్‌లైన్ మెడిసిన్ విక్రయాలపై టీజీ సేఫ్ కొరడా

ABN , Publish Date - Nov 16 , 2026 | 07:51 PM

ఆన్‌లైన్‌లో మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపులపై టీజీ సేఫ్ కొరడా ఝుళిపించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పలు షాపుల లైసెన్సులపై సస్పెన్సన్ విధించింది.

ఆన్‌లైన్ మెడిసిన్ విక్రయాలపై టీజీ సేఫ్ కొరడా
medicine stores license suspension

హైదరాబాద్, నవంబర్ 16: డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో.. ఆన్‌లైన్‌లో మందులు విక్రయించే మెడికల్ షాపులలో.. టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 23 షాపుల లైసెన్సులను సస్పెండ్ చేసింది.


ఆన్‌లైన్‌లో మందులు విక్రయించే సంస్థలైన.. టాటా 1ఎంజీ, నెట్‌మెడ్స్, జెప్టో, అపోలో 24/7, మెడ్‌ప్లస్ తదితర సంస్థలకు అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులలో టీజీ సేఫ్ తనిఖీలు నిర్వహించింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం, ఫార్మాసిస్ట్‌ల పర్యవేక్షణ లోపించడం, మందుల విక్రయాల రికార్డులను నిర్వహించకపోవడం వంటి ఆరోపణలపై టీజీ సేఫ్ ఈ తనిఖీలను నిర్వహించింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులతో కలిసి నిర్వహించిన ఈ ప్రత్యేక తనిఖీలలో.. నిబంధనలు ఉల్లంఘించిన 23 మెడికల్ షాపుల లైసెన్సులపై టీజీసేఫ్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 15 షాపులపై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సస్పెన్షన్‌ను అమలుచేయాలని ఆదేశించగా.. మరో 8 షాపుల లైసెన్సులను నిర్ణీత కాలానికి సస్పెండ్ చేస్తూ ఆదేశించింది. మరో 9 మెడికల్ షాపులకు హెచ్చరికలు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Updated Date - Nov 16 , 2026 | 07:51 PM