అండాల సేకరణ రాకెట్.. ‘ఒయాసిస్ ఫెర్టిలిటీ’పై కేసు
ABN , Publish Date - Nov 14 , 2026 | 06:19 AM
అక్రమంగా అండాల సేకరణ రాకెట్‌లో ఒయాసిస్ ఫెర్టిలిటీ (సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్) యాజమాన్యంపై కేసు నమోదైంది.
ఒక్కో దాతకు బ్రోకర్లకు రూ.65వేలు
ఏడు కంటే తక్కువ అండాలు వస్తే 50 శాతం కోత
బ్రోకర్లతో ఒయాసిస్ నిర్వాహకుల ఒప్పందం
బంజారాహిల్స్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): అక్రమంగా అండాల సేకరణ రాకెట్‌లో ఒయాసిస్ ఫెర్టిలిటీ (సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్) యాజమాన్యంపై కేసు నమోదైంది. వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ పుట్ల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సద్గురు హెల్త్‌కేర్ డైరెక్టర్ డాక్టర్ గేదెల దుర్గారావు, బ్రోకర్లు అమిత్ శర్మ, నిఖత్ పర్వీన్, దీపికతో పాటు ఇతర డైరెక్టర్లపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్‌లోని ఒయాసిస్ ఆస్పత్రి నిర్వాహకుడు, ఏఆర్‌టీ బ్యాంకు డైరెక్టర్ డాక్టర్ గేదెల దుర్గారావు.. అండాల రాకెట్‌కు సంబంధించిన అమిత్ శర్మ, నిఖత్ పర్వీన్ సహా 9మందితో ఒప్పందాలు చేసుకున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు.
ఒక్కో దాతకు బ్రోకర్లకు రూ.65వేల వరకు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని, 7 కంటే తక్కువ అండాలు వస్తే 50 శాతం కోత విధించడం, ఆరో రోజు కంటే ముందే ప్రక్రియ ఆగిపోతే అసలు డబ్బులు ఇవ్వకపోవడం వంటి నిబంధనలు పెట్టి మహిళల ప్రాణాలతో చెలగాటమాడారు. 2026 జనవరి నుంచి అక్టోబరు మధ్య సదరు ఆస్పత్రిలో 66 మంది దాతల వివరాలు నమోదు కాగా, యాజమాన్యం కేవలం 47 మంది ఫైళ్లను మాత్రమే అధికారులకు అందించింది. మిగిలిన వివరాలను దాచిపెట్టింది. అలాగే, ఎలాంటి అనుమతులు, ఒప్పందాలు లేని గచ్చిబౌలి, ఉప్పల్ బ్రాంచీలకు కూడా అండాలను సరఫరా చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష
ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News