Share News

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం చెలగాటం: మహేశ్ గౌడ్

ABN , Publish Date - Jun 06 , 2026 | 03:52 PM

నీట్-యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ప్రధాని చేతగానితనం వల్ల లక్షలాది విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి దాపురించిందన్నారు.

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం చెలగాటం: మహేశ్ గౌడ్
TPCC Chief Mahesh Kumar Goud

హైదరాబాద్, జూన్ 6: నీట్-యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని చేతగాని తనం వల్ల లక్షలాది విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి దాపురించిందన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. నీట్ పరీక్ష వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


విద్యార్థులు నెలల తరబడి కష్టపడి సిద్ధమైతే, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వారి శ్రమ వృధా అయ్యిందని మహేశ్ అన్నారు. నష్టపోయిన విద్యార్థుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే సామాన్య ప్రజలపై కేంద్ర ప్రభుత్వం భారాన్ని వేస్తూ ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

నార్సింగి పీఎస్‌కు బ్రహ్మనాయుడు తరలింపు.. భారీగా చేరుకున్న వైసీపీ కార్యకర్తలు

సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రభుత్వ భూములను కాపాడుతాం: కవిత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 06 , 2026 | 03:53 PM