Share News

3న జాతీయవాదుల పునరేకీకరణ సమావేశం

ABN , Publish Date - Oct 28 , 2026 | 06:45 AM

జాతీయవాద భావజాలంపై దుష్ప్రచారాలు, సైద్ధాంతిక దాడుల నేపథ్యంలో.. దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చే శక్తులంతా ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని ఓయూ, కేయూ జేఏసీ చైర్మన్‌ పాపారావు పిలుపునిచ్చారు.

3న జాతీయవాదుల పునరేకీకరణ సమావేశం
Nationalists Reunion 2026

  • ముఖ్య అతిథిగా బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ బన్సల్‌

  • ఓయూ, కేయూ జేఏసీ చైర్మన్‌ పాపారావు

మన్సూరాబాద్‌, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): జాతీయవాద భావజాలంపై దుష్ప్రచారాలు, సైద్ధాంతిక దాడుల నేపథ్యంలో.. దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చే శక్తులంతా ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని ఓయూ, కేయూ జేఏసీ చైర్మన్‌ పాపారావు పిలుపునిచ్చారు. ఇందుకోసం నవంబర్‌ 3న సాయంత్రం 4గంటలకు నాగోల్‌లోని శుభం కన్వెన్షన్‌ సెంటర్‌లో.. ఉస్మానియ, కాకతీయ విశ్వవిద్యాలయాల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ‘జాతీయవాదుల పునరేకీకరణ-2026’ పేరిట సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను మంగళవారం ఇక్కడ ఆవిష్కరించిన సందర్భంగా పాపారావు మాట్లాడారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలన్నవి సర్వసాధారణమన్నారు. కానీ ఒక భావజాలం ఉనికిని, ఉద్దేశాలను ప్రశ్నిస్తూ మూక దాడులు కొనసాగుతున్నాయని.. దేశ సమగ్రత, సాంస్కృతిక వారసత్వం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కట్టుబడిన వారంతా సమష్టిగా ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 3న నిర్వహించే సభకు ముఖ్య అతిథిగా బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ బన్సల్‌ విచ్చేయనున్నారని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కౌమార సమస్యలపై బడుల్లో అవగాహనా క్లబ్‌లు

డిజైన్లు ధూంధాంగా ఉండాలి

వ్యభిచారం చెయ్‌.. భార్యపై తాగుబోతు భర్త ఒత్తిడి!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 06:45 AM