Share News

పేదల జీవితాల్లో వెలుగు నింపిన ‘ఇందిరమ్మ ఇళ్లు’ : సర్కార్‌పై రాహుల్ ప్రశంసలు

ABN , Publish Date - Nov 10 , 2026 | 09:12 PM

ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి, పేదల జీవితాల్లో వెలుగులు నింపారంటూ రేవంత్ సర్కార్‌పై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రశంసల జల్లు కురిపించారు.

పేదల జీవితాల్లో వెలుగు నింపిన ‘ఇందిరమ్మ ఇళ్లు’ : సర్కార్‌పై రాహుల్ ప్రశంసలు

హైదరాబాద్, నవంబర్ 10: ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి పేదల జీవితాల్లో వెలుగులు నింపారంటూ రేవంత్ సర్కార్‌పై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రశంసల జల్లు కురిపించారు. దీపావళి సందర్భంగా షాద్ నగర్‌లో ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇంట్లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పండుగ వేడుకలు చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను ఎంపీ రాహుల్‌గాంధీకి టీ పీసీసీ చీఫ్ చూపించారు.


అనంతరం తెలంగాణలో రేవంత్ సర్కార్ చేపట్టిన పథకాలపై ఎంపీ రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఆనందం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. అలాగే సన్న బియ్యం, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తదితర పథకాలను ఎంపీ రాహుల్ గాంధీ మెచ్చుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డీఎస్పీల నియామకాల్లో పారదర్శకత పాటించాం: సీఎం రేవంత్ రెడ్డి

416 గ్రామాల్లో భూ రీసర్వే పూర్తి.. భూదార్ నంబర్ల కేటాయింపుపై పొంగులేటి కీలక ఆదేశాలు

Read Latest TG Govt And Telugu News

Updated Date - Nov 10 , 2026 | 09:38 PM