Share News

బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి

ABN , Publish Date - Apr 20 , 2026 | 03:22 PM

జీవన్ రెడ్డిని ఎప్పుడూ హరీశ్ రావు బీఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించలేదని ఎంపీ చామల కిరణ్ రెడ్డి తెలిపారు. కేటీఆర్.. జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లినప్పుడు హరీశ్ రావు వెళ్లలేదని అన్నారు.

బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Chamala Kiran Reddy

హైదరాబాద్, ఏప్రిల్ 20: మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ టూర్‌పై ఎంపీ చామల కిరణ్ రెడ్డి(MP Chamala Kiran Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైందన్నారు. జీవన్ రెడ్డి పార్టీలో చేరడం బీఆర్ఎస్ నేతలకు ఇష్టం లేదన్నారు. జీవన్ రెడ్డిని ఎప్పుడూ హరీశ్ రావు పార్టీలోకి ఆహ్వానించలేదని తెలిపారు. జీవన్ రెడ్డి ఇంటికి కేటీఆర్ వెళ్లినప్పుడు హరీశ్ వెళ్లలేదని అన్నారు. రెండవ సారి జగిత్యాలకు వెళ్లినప్పుడు కేటీఆర్.. హరీశ్‌ రావు ఇంటికి వెళ్లి బ్రతిమిలాడి తీసుకువెళ్లారంటూ వ్యాఖ్యలు చేశారు.


కేసీఆర్ ఇంటికి జీవన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా హరీశ్ రావు వెళ్లలేదని ఎంపీ తెలిపారు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టుకున్నారని అన్నారు. కేసీఆర్ సంవత్సరం తర్వాత ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు వస్తుంటే హరీశ్ రావు ఢిల్లీ వెళ్లారంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ భవిష్యత్తు అంధకారంలో ఉందన్నారు. హరీశ్ రావు ఢిల్లీలో ఎవరిని కలిసి మాట్లాడారు అనేది త్వరలో బయటకు వస్తుందన్నారు. హరీశ్ భవిషత్తు ప్రణాళికలు ఏంటి అనేది ప్రజలకు తెలుసన్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడం వలన లాభం కంటే నష్టమే ఎక్కువని ఎంపీ అన్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడం వాళ్ల కార్యకర్తలకే ఇష్టం లేదని తెలిపారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడారని విమర్శించారు.


జీవన్ రెడ్డికి కాంగ్రెస్ సముచిత స్థానం ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ అంటూ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన సీనియర్ నేతల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. జీవన్ రెడ్డిని చేర్చుకుని కాంగ్రెస్ బలహీన పడిందని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ మునిగిపోయే పడవ అంటూ ఎంపీ చామల కిరణ్ రెడ్డి వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి..

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో అగ్నిప్రమాదం

‘బతికుండగా మీరు అధికారంలోకి రారు’.. హరీశ్‌పై మంత్రి తుమ్మల ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 20 , 2026 | 03:54 PM