Share News

చంద్రబాబు వ్యక్తి కాదు సామూహిక శక్తి: బుద్దా వెంకన్న

ABN , Publish Date - Apr 20 , 2026 | 02:48 PM

తెలుగు జాతి గర్వించదగ్గ, భారత దేశ రాజకీయాలలో సూపర్ స్టార్ చంద్రబాబు అని బుద్దా వెంకన్న కొనియాడారు. భారత దేశంలో ఆయనకు ఉన్న క్రేజు ఏ నాయకులకు లేదన్నారు.

చంద్రబాబు వ్యక్తి కాదు సామూహిక శక్తి: బుద్దా వెంకన్న
Buddha Venkanna

విజయవాడ, ఏప్రిల్ 20: టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు జాతి గర్వించదగ్గ, భారత దేశ రాజకీయాలలో సూపర్ స్టార్ చంద్రబాబు అని కొనియాడారు. భారత దేశంలో ఆయనకు ఉన్న క్రేజు ఏ నాయకులకు లేదన్నారు. చంద్రబాబు ఒక వ్యక్తి కాదు సామూహిక శక్తి అని వెల్లడించారు.


పడి లేచిన కెరటం లాగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యి మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చరిత్ర చంద్రబాబుకే దక్కిందన్నారు. ఆయన కావాలంటే ఇంత కంటే పెద్ద పదవులు ఎన్నో వచ్చి ఉండేవని తెలిపారు. తెలుగు ప్రజల కోసం తెలుగు జాతి కోసం ఆయన ఇక్కడే ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పుకొచ్చారు. తన భర్త చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా నారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలు అన్న క్యాంటీన్‌కు విరాళంగా ఇచ్చారని బుద్దా వెంకన్న తెలిపారు.


ఇవి కూడా చదవండి..

సీఎం చంద్రబాబు పుట్టినరోజు.. ఉద్దండరాయునిపాలెంలో ప్రత్యేక వేడుకలు

చంద్రబాబు ఎలాంటి విజ్ఞాలు లేకుండా ముందుకు సాగాలి: మంత్రి ఆనం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 20 , 2026 | 03:00 PM