చంద్రబాబు ఎలాంటి విఘ్నాలు లేకుండా ముందుకు సాగాలి: మంత్రి ఆనం
ABN , Publish Date - Apr 20 , 2026 | 02:21 PM
సీఎం చంద్రబాబు నిరంతరం ప్రజల కోసం తపిస్తుంటారని మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి తెలిపారు. ఆయన ఎలాంటి విఘ్నాలు లేకుండా ముందుకు సాగాలని, ఇంకా చాలాకాలం సీఎంగా ప్రజలకు తోడుగా ఉండాలని మహాయజ్ఞం నిర్వహించామన్నారు మంత్రి.
నెల్లూరు, ఏప్రిల్ 20: దేశంలోనే రాజకీయంగా సీఎం చంద్రబాబు(CM Chandrababu) గుర్తింపు పొందారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి(Minister Anam Ramanarayana Reddy) తెలిపారు. దేశ, విదేశాలలో చంద్రబాబు జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. నేటి యువత, మహిళలకు దిశానిర్దేశం చేస్తూ అనేక విద్య, ఉపాధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉమ్మడిగా ఏపీ అభివృద్ధి, సంక్షేమం కోసం పాటు పడుతున్నారన్నారు.
చంద్రబాబు నిరంతరం ప్రజల కోసం తపిస్తుంటారని మంత్రి తెలిపారు. ఆయనకు ఎలాంటి విఘ్నాలు లేకుండా ముందుకు సాగాలని, ఇంకా చాలాకాలం సీఎంగా ప్రజలకు తోడుగా ఉండాలని మహాయజ్ఞం నిర్వహించామన్నారు. కూటమి పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని మంత్రి తెలిపారు.
మహిళలకు డ్వాక్రా రుణాలు, కుట్టు మిషన్లు అందించామని... 200 మంది గర్భిణీ మహిళలకు శ్రీమంతాలు చేశామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం రైతుల భూములు లాక్కోవాలని చెల్లని పాసుపుస్తకాలు ఇచ్చిందని విమర్శించారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ ద్వారా పూర్తి హక్కులతో పాసుపుస్తకాలు, పొజీషన్ సర్టిఫికేట్లు పంపిణీ చేశామన్నారు. 106 మంది క్రీడాకారులకు క్రీడా కిట్లు పంపిణీ చేశామని తెలిపారు. అర్హత ఉన్న దివ్యాంగులకు లైసెన్సులు ఇప్పించామని అన్నారు. ఆలయాల్లో సనాతన ధర్మం, ఆచారాలను కాపాడుతూ కైంకర్యాలు నిర్వహిస్తున్నామని.. రూ.750కోట్ల నిధులతో ఆలయాల పునఃనిర్మాణాలు జరుగుతున్నాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్‌కు బుల్లెట్ గాయం
సీఎం చంద్రబాబు పుట్టినరోజు.. ఉద్దండరాయునిపాలెంలో ప్రత్యేక వేడుకలు
Read Latest AP News And Telugu News