Share News

సీఎం చంద్రబాబు పుట్టినరోజు.. ఉద్దండరాయునిపాలెంలో ప్రత్యేక వేడుకలు

ABN , Publish Date - Apr 20 , 2026 | 01:17 PM

అమరావతి శంకుస్థాపన స్థలం ఉద్దండరాయునిపాలెంలో సీఎం చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేదం, రుద్రం పఠనాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. 76 కదంబ మొక్కలను నాటారు.

సీఎం చంద్రబాబు పుట్టినరోజు.. ఉద్దండరాయునిపాలెంలో ప్రత్యేక వేడుకలు
Chandrababu Naidu Birthday

అమరావతి, ఏప్రిల్ 20: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) 76వ పుట్టినరోజు సందర్భంగా అమరావతి శంకుస్థాపన స్థలం ఉద్దండరాయునిపాలెంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. వేదం, రుద్రం పఠనాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్న ఈ కార్యక్రమంలో తొమ్మిది మంది పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నీరు-మట్టి ప్రదేశంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా 76 కదంబ మొక్కలను నాటే కార్యక్రమం నిర్వహించారు. శ్రీశైలం నుంచి తెచ్చిన కదంబ విత్తనాలతో ఈ మొక్కలను పెంచారు. కదంబ వృక్షానికి పార్వతి దేవి ఆశీస్సులు ఉన్నాయని, లలిత సహస్రనామంలో దీని ప్రాధాన్యం ప్రస్తావించబడిందని ప్రజల విశ్వాసం. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు జరిగాయి.


కెనడా వాసి నవీన్ చౌదరి కొడాలి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక వేడుకలు ఘనంగా జరిగాయి. వేప, రావి మొక్కలను నాటిన కెనడా వాసులు.. చంద్రబాబు దీర్ఘాయుష్షు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలని, సీఎం చంద్రబాబు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీ జనార్దన్, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి..

ఏపీ వ్యాప్తంగా ఘనంగా సీఎం చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు

గన్‌ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్‌కు బుల్లెట్ గాయం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 20 , 2026 | 01:21 PM