Share News

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో అగ్నిప్రమాదం

ABN , Publish Date - Apr 20 , 2026 | 09:28 AM

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. గచ్చిబౌలిలోని ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో షార్ట్‌ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో అగ్నిప్రమాదం
Hyderabad Fire Accident

హైదరాబాద్, ఏప్రిల్ 20: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈరోజు(సోమవారం) అగ్నిప్రమాదం సంభవించింది. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అపార్ట్‌మెంట్ మొత్తం దట్టమైన పొగ అలముకుంది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బిల్డింగ్ సెల్లార్‌లో షార్ట్‌ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.


ఈ ప్రమాదంలో సెల్లార్‌లోని 15 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. తీవ్ర అస్వస్థతకు గురైన ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.


ఇవి కూడా చదవండి..

సీఎం చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెప్పిన జగన్, షర్మిల

సీఎం చంద్రబాబు జన్మదినం.. వెల్లువెత్తిన శుభాకాంక్షలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 20 , 2026 | 10:38 AM