సింహాచలంలో స్వామి వారి చందనోత్సవం.. దర్శించుకున్న ప్రముఖులు
ABN , Publish Date - Apr 20 , 2026 | 06:44 AM
సింహాచలంలో కొలువుదీరిన శ్రీలక్ష్మీ వరహా స్వామివారి చందనోత్సవం అంగరంగవైభవంగా జరుగుతుంది. సోమవారం తెల్లవారుజామున స్వామి వారిని ఆలయ అనువంశిక ధర్మకర్తలు పి. అశోక్ గజపతిరాజుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 20: సింహాచలంలో కొలువుదీరిన శ్రీలక్ష్మీ వరహా స్వామివారి చందనోత్సవం అంగరంగవైభవంగా జరుగుతోంది. సోమవారం తెల్లవారుజామున స్వామి వారిని ఆలయ అనువంశిక ధర్మకర్తలు పి. అశోక్ గజపతిరాజుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి హోం మంత్రి వంగలపూడి అనిత పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు స్వామి వారిని దర్శించుకున్నారు.
స్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా సింహాచలానికి తరలి వచ్చారు. క్యూ లైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. ఆలయం వద్ద భక్తులను నియంత్రించేందుకు హోం మంత్రి అనిత స్వయంగా రంగంలోకి దిగారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు దేవస్థానం, స్థానిక ఉన్నతాధికారులతో ఇప్పటికే మంత్రులు, ఉన్నతాధికారులు వరుసగా సమీక్షలు నిర్వహించిన విషయం విదితమే. ఈ ఒక్క రోజే మాత్రమే సింహాచలంలోని శ్రీ వరాహా లక్ష్మీ నరసింహ స్వామి వారు నిజరూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేటీఆర్‌దే క్రాస్ బ్రీడ్: ఎమ్మెల్యే సంజయ్
డిజిటల్ అరెస్టులకు సీబీఐ చాట్‌బాట్‌తో చెక్!
For More AP News And Telugu News