Share News

కేటీఆర్‌దే క్రాస్‌ బ్రీడ్‌: ఎమ్మెల్యే సంజయ్‌

ABN , Publish Date - Apr 20 , 2026 | 06:17 AM

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌దే క్రా్‌స్‌బ్రీడ్‌ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ ఎం సంజయ్‌ కుమార్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ..

కేటీఆర్‌దే క్రాస్‌ బ్రీడ్‌: ఎమ్మెల్యే సంజయ్‌

  • అక్రమ సంపాదనతో వచ్చిన అహంకారమని వ్యాఖ్య

జగిత్యాల, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌దే క్రా్‌స్‌బ్రీడ్‌ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ ఎం సంజయ్‌ కుమార్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. తనను క్రాస్‌ బ్రీడ్‌ నాయకుడని కేటీఆర్‌ సంబోధించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘నేను రాజకీయ వ్యభిచారినైతే.. నువ్వు వ్యభిచార కొంప నడిపావా? గతంలో వైసీపీ, కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న నీదా క్రాస్‌ బ్రీడ్‌..? నాదా..?’ అని కేటీఆర్‌ను నిలదీశారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రశేఖర్‌ గౌడ్‌ను నిలబెట్టి.. జీవన్‌రెడ్డికి క్రాస్‌ ఓటేయించిన క్రాస్‌బ్రీడ్‌ నాయకుడు కేటీఆర్‌.. అక్రమ సంపాదనతో వచ్చిన అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబ అహంకారపూరిత వ్యాఖ్యలతోనే రాష్ట్రంలో వెలమ జాతి గౌరవం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేటీఆర్‌ రాజకీయాల్లోకి రాక ముందు నుంచే తానూ తన కుటుంబం రాజకీయాల్లో ఉన్నామన్న సంజయ్‌.. రాజకీయాల్లోకి వచ్చాక తన ఆస్తులు తగ్గాయే తప్ప పెరగలేదని స్పష్టం చేశారు.

Updated Date - Apr 20 , 2026 | 06:18 AM