Share News

కూతురిపై అత్యాచారానికి సహకరించిన తల్లి!

ABN , Publish Date - Sep 22 , 2026 | 05:56 AM

కన్న కూతురి పాలిట తల్లే దయ్యమైంది! తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. తన 16 ఏళ్ల కూతురిపై కన్నెస్తే అపర కాళికలా మారి, బుద్ధి చెప్పాల్సింది పోయి.. అతడికి సహకరించింది.

కూతురిపై అత్యాచారానికి  సహకరించిన తల్లి!
Uppal POCSO case

  • తనతో వివాహేతర సంబంధంలో ఉన్న

  • వ్యక్తికి కుమార్తెను అప్పగించిన వైనం

  • బాలిక గర్భం దాలిస్తే ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్‌

  • మేనమామ సహకారంతో పోలీసులకు బాలిక ఫిర్యాదు

  • తల్లి కళ్లెదుటే అతడు తనను రేప్‌ చేస్తున్నా

  • ఆమె కాపాడలేదని ఫిర్యాదులో పేర్కొన్న బాలిక

  • పోక్సో కేసు నమోదు చేసి నిందితుణ్ని, బాలిక తల్లిని రిమాండుకు తరలించిన పోలీసులు.. ఉప్పల్‌లో ఘటన

ఉప్పల్‌, సెప్టెంబర్‌ 21 (ఆంధ్రజ్యోతి): కన్న కూతురి పాలిట తల్లే దయ్యమైంది! తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. తన 16 ఏళ్ల కూతురిపై కన్నెస్తే అపర కాళికలా మారి, బుద్ధి చెప్పాల్సింది పోయి.. అతడికి సహకరించింది. కుమార్తెను అతడికి అప్పగించి.. తన కళ్ల ముందే ఆమెపై అత్యాచారం చేస్తుంటే చూస్తూ ఉండిపోయింది. బాలిక తనను కాపాడమని వేడుకున్నా ఆ తల్లి మనసు కరగలేదు. ఆ దుర్మార్గుడు పలుమార్లు అత్యాచారం చేయడంతో, బాలిక గర్భం దాల్చగా.. తల్లి, అతడు కలిసి ఆమెకు ఒక ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్‌ చేయించినట్టు సమాచారం. ఉప్పల్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.


ఉప్పల్‌ ప్రాంతానికి చెందిన మహిళ కూలిపని చేస్తూ జీవిస్తోంది. భర్త తాగుబోతు కావడంతో.. మేడిపల్లికి చెందిన ఒక వ్యక్తితో వివాహేతరసంబంధం పెట్టుకుంది. అతడు ఆమె కుమార్తెపైనా కన్నేశాడు. తల్లిని ఒప్పించి కూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు బాలిక తన అక్కతో ఈ విషయాన్ని చెప్పి.. మేనమామ సహకారంతో ఉప్పల్‌ పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటకు వచ్చింది. తల్లి కళ్లెదుటే అతడు తనపై అత్యాచారం జరిపినా అమ్మ తనను కాపాడలేదని ఆ బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కిందటి శనివారం (సెప్టెంబరు 19న) బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితుణ్ని, బాలిక తల్లిని రిమాండుకు తరలించారు. బాలికకు అబార్షన్‌ చేసిన ఆసుపత్రి వివరాలు తెలుసుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీవో, ఎంవీఐ, కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌..!
సత్తుపల్లికి గోదారమ్మ!
Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 05:56 AM