Share News

కావాల్సిన వారికి కట్టబెట్టేందుకే!

ABN , Publish Date - Nov 12 , 2026 | 05:30 AM

మొబైల్‌ క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ బస్సుల కొనుగోలు టెండర్‌ను ఒక్క కంపెనీకే కట్టబెట్టేందుకు ఎంఎన్‌జే ఆస్పత్రిలోని ఓ వైద్యుడు, కొంత మంది సిబ్బంది కలిసి కుట్ర చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

కావాల్సిన వారికి కట్టబెట్టేందుకే!
MNJ Cancer Hospital

  • క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ బస్సుల కొనుగోలు టెండర్‌లో విచిత్ర నిబంధన

  • ఎంఎన్‌జేలో ఓ వైద్యుడు, కొంతమంది సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు

హైదరాబాద్‌, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): మొబైల్‌ క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ బస్సుల కొనుగోలు టెండర్‌ను ఒక్క కంపెనీకే కట్టబెట్టేందుకు ఎంఎన్‌జే ఆస్పత్రిలోని ఓ వైద్యుడు, కొంత మంది సిబ్బంది కలిసి కుట్ర చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గ్రామీణ, బొగ్గు గనులు ఉన్న ప్రాంతాల్లో పేద ప్రజలకు క్యాన్సర్‌ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన స్ర్కీనింగ్‌ బస్సులను కొనుగోలు చేయాలని సింగరేణి సంస్థ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ(సీఎ్‌సఆర్‌) నిధుల కింద రూ.9.2కోట్లను ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రికి అందజేసింది. అయితే, లేట్‌ చేయకుండా డిసెంబరు 31లోగా బస్సులను కొనుగోలు చేయాలని షరతు పెట్టింది. కేవలం రెండు నెలల వ్యవధిలో బస్సులను కొనడం, వాటిల్లో మార్పులు చేసి ఏడెనిమిది రకాల వైద్యపరికరాలను అందులో సెట్‌ చేయడం సాధ్యం కాదు.


అందువల్ల ఈ షరతును సాకుగా చూపించి రోజుల వ్యవధిలోనే హడావుడిగా టెండర్‌ను పిలిచి, అనుకున్న సంస్థకు కట్టబెట్టేందుకు ఎంఎన్‌జే ఆస్పత్రిలోని కొందరు అధికారులు ప్లాన్‌ చేసినట్లు ఆరోపణలున్నాయి. బస్సుల కొనుగోలు కోసం ఈ నెల 7న టెండర్‌ పిలిచారు. తుది గడువు ఈ నెల 13. అంటే వారం రోజుల వ్యవధి మాత్రమే ఇచ్చారు. మొత్తం నాలుగు బస్సుల కొనుగోలు కోసం టెండర్‌ పిలిచారు. ఒక్కో బస్సు విలువ రూ.2.3కోట్లు. అలాగే బస్సులో మోమోగ్రఫీ, అలా్ట్రసౌండ్‌, కోల్పోస్కోపీ, బయోకెమిస్ట్రీ, హెమటాలజీ, సెల్‌ కౌంటర్‌, యూరిన్‌ అనాలసిన్‌ మిషన్స్‌తో పాటు ఓరల్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఎగ్జామినేషన్‌ సెంటర్స్‌ను కూడా ఏర్పాటు చేయాలని టెండరు నిబంధనల్లో పేర్కొన్నారు.


వీటితో పాటు మెడికల్‌ ఎక్వి్‌పమెంట్స్‌, సర్వీస్‌ ప్రొవైడర్స్‌ను కాకుండా ఆయా పరికరాలను ఫ్యాబ్రికేషన్‌ చేసే సంస్థలు టెండర్‌కు అర్హులంటూ విచిత్రమైన నిబంధన పెట్టారు. అలాగే మొబైల్‌ మోమోగ్రఫీలో అనుభవంతో పాటు ఫ్యాబ్రికేషన్‌లో పదేళ్ల అనుభవం ఉండాలని, అలాగే ఇన్‌హౌజ్‌ ఫ్యాబ్రికేషన్‌ ఫెసిలిటీ అండ్‌ హైదరాబాద్‌ వర్క్‌షాప్‌ ఆపరేషన్స్‌ చేస్తూ కనీసం 4-5ఏళ్ల అనుభవం ఉన్నవారు అర్హులని అందులో పేర్కొన్నారు. ఈ ప్రత్యేక నిబంధనల వల్ల కేవలం ఒక్కరికే టెండరు దక్కే అవకాశం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి.

ఇంటర్‌కు ఇక సెలవు!

₹40 వేల కోట్లకు టోకెన్లు

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 05:30 AM