శ్రీజారెడ్డి ఆచూకీ కనుక్కోండి
ABN , Publish Date - Nov 11 , 2026 | 05:50 AM
అమెరికాలో అదృశ్యమైన నల్లగొండ జిల్లా విద్యార్థిని కోయ శ్రీజారెడ్డి ఆచూకీ త్వరగా కనుగొనాలని కేంద్ర గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డితోపాటు విదేశాంగశాఖ, బోస్టన్‌లోని భారత్ కాన్సులేట్ అధికారులను తెలంగాణ రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, విదేశాంగశాఖ, బోస్టన్‌లో
భారత్ కాన్సులేట్‌లకు మంత్రి కోమటిరెడ్డి ఈ-మెయిల్స్
తానా ప్రతినిధులతోనూ వాకబు
హైదరాబాద్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో అదృశ్యమైన నల్లగొండ జిల్లా విద్యార్థిని కోయ శ్రీజారెడ్డి ఆచూకీ త్వరగా కనుగొనాలని కేంద్ర గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డితోపాటు విదేశాంగశాఖ, బోస్టన్‌లోని భారత్ కాన్సులేట్ అధికారులను తెలంగాణ రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఈ మేరకు వారికి ఈ-మెయిల్స్ పంపారు. తాజాగా స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని ఆమె ఆచూకీ కనుక్కోవడానికి చర్యలు వేగవంతం చేయాలని బోస్టన్‌లోని తానా ప్రతినిధి కృష్ణప్రసాద్‌ను ఫోన్‌లో కోరారు.
మంత్రి పంపిన ఈ-మెయిల్స్ ఆధారంగా స్థానిక పోలీసుల సహకారంతో శ్రీజ ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ఆయనకు తానా ప్రతినిధి కృష్ణప్రసాద్ వివరించారు. ఈ విషయమై బోస్టన్ పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేయడంతోపాటు కేసు దర్యాప్తులో పురోగతిని తెలుసుకునేందుకు పోలీస్ స్టేషన్‌కెళ్లి.. ఉన్నతాధికారులతో తానా ప్రతినిధులు మాట్లాడారు. ఆమె ఆచూకీ కోసం శ్రీజ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్న నేపథ్యంలో క్షేమంగా ఆమె తిరిగి వచ్చే వరకూ ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని బోస్టన్ కాన్సులేట్ జనరల్‌ను మంత్రి కోమటి రెడ్డి కోరారు. గంటకోసారి సంబంధిత అధికారులతో మంత్రి కార్యాలయం సంప్రదిస్తూ.. దర్యాప్తు పురోగతి, తాజా సమాచారాన్ని సేకరిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి.
విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!
రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్!
ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News