హైదరాబాద్‌లో రెండేళ్ల బాలిక కిడ్నాప్‌నకు యత్నం
ABN , Publish Date - Aug 13 , 2026 | 10:46 AM
బాకీ తీర్చలేదని రెండేళ్ల బాలికను కిడ్నాప్‌నకు ఓ వ్యక్తి యత్నించాడు. అప్పు తీర్చలేదనే కోపంతో బాలికను తీసుకెళ్లేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు.
హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో బాకీ తీర్చలేదని రెండేళ్ల బాలికను కిడ్నాప్‌నకు ఓ వ్యక్తి యత్నించాడు. అప్పు తీర్చలేదనే కోపంతో బాలికను తీసుకెళ్లేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. పోలీసులకు ఫోన్ చేసి బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. హనుమాన్ నగర్‌లో అద్దె ఇంట్లో ఈ కుటుంబం నివాసం ఉంటోంది. మానికేశ్వరీ నగర్‌లో నివాసం ఉన్న సమయంలో పరిచయస్తుడి వద్ద రూ.30 వేల అప్పును బాలిక కుటుంబ సభ్యులు తీసుకున్నారు.
అప్పు తిరిగి చెల్లించకపోవడంతో బుధవారం ఇంటికి ఆ వ్యక్తి వచ్చాడు. ఈ క్రమంలో డబ్బులు ఇవ్వాలంటూ కుటుంబ సభ్యులతో సదరు వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. డబ్బులు ఇచ్చే వరకు మీ కుమార్తెను తీసుకెళ్తానంటూ అతడు బెదిరించాడు. రెండేళ్ల బాలికను తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై బాధిత కుటుంబం పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆ బాలికను తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
వార్తలు కూడా చదవండి...
ఆ బ్యారేజీల్లో ఎన్డీఎస్ఏ సూచనలు పాటించాలి: సీఎం రేవంత్‌రెడ్డి
జీఆర్ఎంబీ అజెండాపై తెలంగాణ సర్కార్ అభ్యంతరాలు
మహిళా సంఘాలను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News