Share News

బీజేపీ నేతలదే దేశ ద్రోహం

ABN , Publish Date - Nov 16 , 2026 | 04:50 AM

భారత్‌ సమ్మిట్‌కు వచ్చిన విదేశీ ప్రతినిధులను సన్మానించి పెట్టుబడులను ఆకర్షించడం దేశ ద్రోహం ఎలా అవుతుందంటూ బీజేపీ నేతలను కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు.

బీజేపీ నేతలదే దేశ ద్రోహం
Mallu Ravi

  • విదేశీ ప్రతినిధుల ముందు ధర్నా చేస్తారా?: మల్లు రవి

  • తెలంగాణను అవమానించేలా సంజయ్‌ వ్యాఖ్యలు: చరణ్‌ కౌశిక్‌

హైదరాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): భారత్‌ సమ్మిట్‌కు వచ్చిన విదేశీ ప్రతినిధులను సన్మానించి పెట్టుబడులను ఆకర్షించడం దేశ ద్రోహం ఎలా అవుతుందంటూ బీజేపీ నేతలను కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు వచ్చిన ఆ విదేశీ ప్రతినిధుల ముందు బీజేపీ నేతలు ధర్నా చేయడాన్ని, వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించడాన్నే దేశ ద్రోహం అంటారని మండిపడ్డారు. భారత్‌ సమ్మిట్‌కు వచ్చిన రాహుల్‌ గాంధీ దేశద్రోహం చేశారంటూ ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. భారత్‌ సమ్మిట్‌ వల్ల రాష్ట్రం అపవిత్రమైందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యానించడం.. రాష్ట్ర ప్రగతిని, ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ చరణ్‌కౌశిక్‌ యాదవ్‌ మండిపడ్డారు.


గతంలో ఢిల్లీలో జరిగిన సమ్మిట్‌ కర్టెన్‌-రైజర్‌ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అభినందనలు కూడా తెలిపారని గుర్తు చేశారు. కానీ సంజయ్‌ మాత్రం భారత్‌ సమ్మిట్‌ కార్యక్రమాన్ని దేశ ద్రోహం అనడం బీజేపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. జపాన్‌ డిప్యూటీ కాన్సుల్‌ జనరల్‌ ఇగాయ్‌ యుకాతో కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, భారత్‌-జపాన్‌ ద్వైపాక్షిక సహకారంపై సుదీర్ఘంగా వారు చర్చించారు. గతేడాది ఏప్రిల్‌లో జపాన్‌ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో 86 ఎకరాల విస్తీర్ణంలో ఎకో టౌన్‌షిప్‌ అభివృద్ధి, గ్రీన్‌ కొలాబరేషన్‌ ఒప్పందానికి సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదనపైనా చర్చలు జరిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒళ్లంతా వణుకుడే...!

తెలంగాణకు భారీ వర్ష సూచన

సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 04:50 AM