Share News

ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి ఫిర్యాదుపై మల్లు రవి స్పందన

ABN , Publish Date - May 19 , 2026 | 04:39 PM

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి పలువురిపై ఫిర్యాదు చేశారని క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. రామసహాయం కృష్ణ కిషోర్ రెడ్డి, హరిప్రసాద్‌లపై ఫిర్యాదు అందిందన్నారు.

ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి ఫిర్యాదుపై మల్లు రవి స్పందన
Mallu Ravi

హైదరాబాద్, మే 19: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి పలువురిపై ఫిర్యాదు చేశారని క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. రామసహాయం కృష్ణ కిషోర్ రెడ్డి, హరిప్రసాద్‌లపై ఫిర్యాదు అందిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోవడానికి కారణం ఇద్దరే అని ఫిర్యాదు అందినట్లు తెలిపారు. కృష్ణ కిషోర్ రెడ్డి, హరిప్రసాద్ తమ వాదనలు వినిపించారని.. ఎమ్మెల్యేతో కలిసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పని చేస్తామని ఇద్దరు నేతలు హామీ ఇచ్చారన్నారు. అందరూ కలిసి పనిచేస్తే పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంటుందని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయం చైర్మన్‌గా ఉన్న శ్రీకాంత రెడ్డి రెండు వర్గాలను కో ఆర్డినేట్ చేస్తారని.. ఎవరినీ సస్పెండ్ చేయాలనే ఉద్దేశ్యం తమకు లేదని స్పష్టం చేశారు.


జీహెచ్‌ఎంసీ పరిధిలోని నేతలకు వార్నింగ్

జీహెచ్‌ఎంసీ పరిధిలోని నేతలకు క్రమశిక్షణ కమిటీ వార్నింగ్ ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎవరికి వాళ్లు ప్రకటించుకున్నారని మల్లు రవి తెలిపారు. యూత్ కాంగ్రెస్ నేతలు తామే పోటీ చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి చర్యలు చేస్తే వేటు వేస్తామని హెచ్చరించారు. అభ్యర్థి ప్రకటనకు కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రొసీజర్ ఉంటుందన్నారు.


ధర్మపురి అరవింద్‌కు కౌంటర్

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు మల్లు రవి స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చారు. ‘మనది వెస్ట్ బెంగాల్, బిహార్ కాదు.. ఇక్కడ సీఎంగా ఉన్నది రేవంత్ రెడ్డి. తానే మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించే శక్తి ఉన్నవాడు రేవంత్. ఎత్తుకు పై ఎత్తులు వేసి రేవంత్ మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలరు. సౌత్ ఇండియాలో పార్టీ బలోపేతం కోసం రేవంత్ పని చేస్తున్నారు. రేవంత్ దూకుడును అడ్డుకోవడానికే ధర్మపురి అరవింద్ ప్రయత్నం చేస్తున్నారు. డి.శ్రీనివాస్ జీవిత కాలంలో 90 శాతం కాంగ్రెస్ పార్టీలోనే పని చేశారు. డీఎస్ కొడుకు అరవింద్.. సీఎం రేవం‌త్‌పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ ఇమేజ్ చెడగొట్టాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు’ అని మల్లు రవి వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి...

భార్యపై కత్తితో దాడి చేసి చంపేసిన భర్త

పాలమూరు ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదు: మంత్రి జూపల్లి కృష్ణారావు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 19 , 2026 | 05:21 PM