దారుణం.. భార్యపై కత్తితో దాడి చేసి చంపేసిన భర్త
ABN , Publish Date - May 19 , 2026 | 02:45 PM
హైదరాబాద్‌లోని కవాడిగూడలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను భర్త అతికిరాతకంగా కత్తితో దాడి చేసి చంపేశాడు.
హైదరాబాద్, మే 19: గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కవాడిగూడలో కట్టుకున్న భార్యను భర్త అతి కిరాతకంగా చంపేశాడు. గొడవ పడి స్పా సెంటర్‌కు వచ్చిన భార్యపై భర్త కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. బంగి దేబోరా అనే మహిళ తన భర్తతో కలిసి బహదూర్‌పూర్ కిషన్‌బాగ్‌లో నివసిస్తోంది. కవాడిగూడలోని స్పా సెంటర్‌లో మృతురాలు బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ రోజు (మంగళవారం) ఉదయం కూడా దంపతుల మధ్య గొడవ జరిగింది. తర్వాత భార్య దేబోరా.. విధుల నిమిత్తం స్పా సెంటర్‌కు వెళ్లింది.
భార్య గొడవపడటంతో ఆగ్రహానికి గురైన భర్త.. కవాడిగూడ రత్నదీప్ బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తులో ఉన్న స్పా సెంటర్‌కు వెళ్లాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హత్య అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆపై అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలికి చేరుకుని బంగి దేబోరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఇవి కూడా చదవండి...
దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల లైంగిక దాడి
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News