Share News

దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల లైంగిక దాడి

ABN , Publish Date - May 19 , 2026 | 11:07 AM

సినిమా షూటింగ్ ఆశచూపి ఓ యువతిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ సమీపంలో ఇద్దరు యువతులు నివసిస్తున్నారు.

దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల లైంగిక దాడి
Hyderabad News

హైదరాబాద్, మే 19: సినిమా షూటింగ్ ఆశచూపి ఓ యువతిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ సమీపంలో ఇద్దరు యువతులు నివసిస్తున్నారు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారిలో ఓ యువతికి సినిమా షూటింగ్ ఉందంటూ యువకుడు మాయమాటలు చెప్పి నమ్మించాడు. సినిమా షూటింగ్ అనడంతో నమ్మిన యువతి.. యువకుడితో కలిసి సికింద్రాబాద్‌కు వెళ్లింది. సికింద్రాబాద్‌లోని గదికి తీసుకెళ్లిన యువకుడు.. తన స్నేహితుడితో కలిసి యువతిపై రెండు రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు.


నిందితులు ఈనెల 16న ర్యాపిడో బుక్ చేయించి తిరిగి యువతిని ఇంటికి పంపించేశారు. బాధితురాలి శరీరంపై గాయాలు ఉండటంతో స్నేహితురాలు ఆమెను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది. అక్కడ వైద్యులు ఏం జరిగిందని ప్రశ్నించగా.. లైంగిక దాడి జరిగిన విషయాన్ని బాధితురాలు చెప్పింది. ఈ ఘటనపై బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరు గుర్తుతెలియని యువకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

దొంగల బీభత్సం.. తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్

కుప్పలుగా నోట్ల కట్టలు.. జలమండలి జీఎం ఇంట్లో ఏసీబీ సోదాలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 19 , 2026 | 11:07 AM