Share News

మత్స్యకారులకు అండగా ప్రభుత్వం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - May 19 , 2026 | 12:38 PM

చరిత్రలో తొలిసారి రూ.262 కోట్లు మత్స్యకారుల ఖాతాల్లో జమ చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

మత్స్యకారులకు అండగా ప్రభుత్వం: సీఎం చంద్రబాబు
CM Chandrababu

నెల్లూరు, మే 19: మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం తుమ్మలపెంటలో ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద రూ.262 కోట్ల నిధులను సీఎం విడుదల చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. చరిత్రలో తొలిసారి రూ.262 కోట్లు మత్స్యకారుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. రూ.3,256 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ‘బోటూ మనదే.. వేటా మనదే’ అని సీఎం అన్నారు.


‘మన జలాల్లోకి వేటకి వస్తే వెంటాడతాం. మన రాష్ట్ర తీరంపై మనకే పూర్తి హక్కులు. ఇతర రాష్ట్రాల బోట్లు వస్తే శాటిలైట్‌తో గుర్తిస్తాం’ అని సీఎం వెల్లడించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారులకు ఇబ్బందులు ఉండవన్నారు. జువ్వలదిన్నె హార్బర్‌‌ను త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు. ‘జువ్వలదిన్నె హార్బర్‌ మీ సొంతం.. నకిలీ ప్రచారాలు నమ్మొద్దు. సముద్ర సంపద పెంచుకోవాలి. సముద్రపు నీటితో సీవీడ్‌ కల్చర్ చేస్తే డబ్బులే.. డబ్బులే’ అని అన్నారు. చేపలు మంచి ప్రొటీన్‌ అని.. చేపలు తింటే డయాబెటిస్‌ రాదన్నారు. ‘మీ చేపల ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తా’ అని అన్నారు. 200 మెకనైజ్డ్‌ బోట్ల మంజూరుతో పాటు రాయితీ ఇస్తామన్నారు. ఆక్వాను ఎక్కువ చేయాలని సీఎం పేర్కొన్నారు.


వైసీపీ హయాంలో మత్స్యకారుల సాయాన్ని రూపాయి కూడా పెంచలేదని సీఎం విమర్శించారు. 2019-24 మధ్య జగన్ విధ్వంసకర పాలన చేశారని మండిపడ్డారు. 18 నెలల్లో తిరుపతి నుంచి బుల్లెట్ వాహనాలు తయారీ మొదలవనుందని తెలిపారు. ప్రస్తుతం స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. టీడీపీ డీఎన్‌ఏలో బీసీలు ఉన్నారని.. మనది తిరుగులేని అనుబంధమని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. పరిశ్రమలు, అభివృద్ధిని గొడ్డలి పార్టీ ఓర్వలేకపోతోందన్నారు. సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్‌పై దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్‌లో స్థానికులకే ఉద్యోగాలు అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల లైంగిక దాడి

ఆ నిధుల విడుదలపై మత్స్యకారుల హర్షం.. కృష్ణానదిలో బోట్లతో ర్యాలీ

Read Latest AP News And Telugu News

Updated Date - May 19 , 2026 | 01:12 PM