Share News

ఆ నిధుల విడుదలపై మత్స్యకారుల హర్షం.. కృష్ణానదిలో బోట్లతో ర్యాలీ

ABN , Publish Date - May 19 , 2026 | 11:52 AM

విజయవాడలోని కృష్ణానదిలో బోట్లతో మత్య్సకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా కృష్ణానదిలో బోట్ల ర్యాలీతో ప్రభుత్వానికి మత్స్యకారులు మద్దతు తెలియజేశారు.

ఆ నిధుల విడుదలపై మత్స్యకారుల హర్షం.. కృష్ణానదిలో బోట్లతో ర్యాలీ
Krishna River boat rally

అమరావతి, మే 19: కృష్ణానదిలో బోట్లతో మత్య్సకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. మత్స్యకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బోట్ల ప్రదర్శన చేశారు. వరుసగా రెండో ఏడాది ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద నిధుల విడుదల చేయడంపై మత్య్సకార కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తమ సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా కృష్ణానదిలో బోట్ల ర్యాలీతో ప్రభుత్వానికి మత్స్యకారులు మద్దతు తెలియజేశారు. వేట నిషేధ సమయంలో ఇబ్బంది పడకుండా ఒక్కో మత్స్యకార కుటుంబానికి ప్రభుత్వం రూ.20 వేల ఆర్థిక భరోసా ఇస్తోంది.


నిరుడు 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్ల సాయాన్ని ప్రభుత్వం అందజేసింది. ఈ ఏడాది 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సహాయాన్ని సీఎం చంద్రబాబు అందించనున్నారు. ఇవాళ(మంగళవారం) నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపెంటలో మత్య్సకారుల సేవలో కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. మత్య్సకారుల కుటుంబాలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. రెండేళ్లలోనే ‘మత్స్యకారుల సేవలో’ పథకం ద్వారా రూ.505 కోట్ల సాయాన్ని కూటమి ప్రభుత్వం అందించింది.


ఇవి కూడా చదవండి...

కుప్పలుగా నోట్ల కట్టలు.. జలమండలి జీఎం ఇంట్లో ఏసీబీ సోదాలు

దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల లైంగిక దాడి

Read Latest AP News And Telugu News

Updated Date - May 19 , 2026 | 11:55 AM