Home » Palakurthi
తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం ఆదివారం గాంధీభవన్‌లో సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై కమిటీ చర్చిస్తోంది. పాలకుర్తి నియోజకవర్గంలో నెలకొన్న అంతర్గత విభేదాలు, కామారెడ్డి జిల్లా నాయకుల మధ్య తలెత్తిన వివాదాలపై కమిటీ దృష్టి సారించింది.
పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి పని చేయాలని పాలకుర్తి నియోజకవర్గంలోని నేతలతోపాటు కేడర్‌కు ఎంపీ, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలపై స్థానిక నేతలతో ఆదివారం హైదరాబాద్‌లో మల్లు రవి సమావేశమయ్యారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి పలువురిపై ఫిర్యాదు చేశారని క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. రామసహాయం కృష్ణ కిషోర్ రెడ్డి, హరిప్రసాద్‌లపై ఫిర్యాదు అందిందన్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యంత్రి కేసీఆర్ చేపట్టిన పర్యటనపై కాంగ్రెస్ ( Congress ) నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కేసీఆర్ తీహార్ జైలులో ఉన్న కవితను పరామర్శిస్తే బాగుండేదని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ ( BRS ) నేతలను IPC 390 సెక్షన్‌తో కాంగ్రెస్ వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ( MLA Nagaraju ) పోల్చారు. కాంగ్రెస్ హామీలను 420తో పోల్చిన కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఎమ్మెల్యే నాగరాజు ఈ కామెంట్స్ చేశారు. సోమవారం నాడు పాలకుర్తి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.
రాష్ట్రంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన ‘‘హాత్ సే హాత్’’ జోడో పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.