సోనియా పుస్తకం చదవండి
ABN , Publish Date - Nov 12 , 2026 | 05:47 AM
ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ రాసిన ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కోరారు.
విమర్శలను పట్టించుకోవద్దు: టీపీసీసీ చీఫ్ మహేశ్
హైదరాబాద్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ రాసిన ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కోరారు. పుస్తకంపై వస్తున్న రాజకీయ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సోనియా తన జీవితంలోని అనుభవాలు.. ఇందిర, సంజయ్, రాజీవ్ గాంధీ మరణాలు సహా ఎన్నో విషాదాలను అందులో ప్రస్తావించినట్టు తెలిపారు.
విదేశాల్లో పుట్టినా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించిన ఆదర్శ మహిళ సోనియాగాంధీ అని, దేశ రాజకీయాలను ఆకళింపు చేసుకుని పార్టీని నడిపిస్తున్న నాయకురాలని కొనియాడారు. కాగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తాను నష్ట పోయానంటూ ఉద్యమకారుడు లక్ష్మణ్‌గౌడ్ సూసైడ్ నోట్ రాస్తే.. ప్రభుత్వం తీరువల్లే చనిపోయాడంటూ హరీశ్‌రావు వక్రీకరిస్తున్నాడని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు. తాము లక్ష్మణ్‌గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి రూ.5లక్షల సాయం చేశామని, ఆయన భార్యకు ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News