పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆరే..
ABN , Publish Date - Sep 20 , 2026 | 06:05 AM
దానం నాగేందర్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు కేసీఆర్‌కే చెంపపెట్టు లాంటిదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆరేనని, ఫిరాయింపులపై ఇప్పుడు బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
హైకోర్టు తీర్పు ఆయనకే చెంపపెట్టు: మహేశ్‌గౌడ్
న్యూఢిల్లీ/హైదరాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): దానం నాగేందర్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు కేసీఆర్‌కే చెంపపెట్టు లాంటిదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆరేనని, ఫిరాయింపులపై ఇప్పుడు బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఫిరాయింపులకు కేసీఆర్ అంకురార్పణ చేసిన సంగతి అందరికీ తెలిసిందేనని.. 2014, 2018లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వమే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని గుర్తు చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో మహేశ్‌గౌడ్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. గతంలో కేసీఆర్ చేసిన అప్రజాస్వామిక చర్యలను మర్చిపోయి, ఇప్పుడు బీఆర్‌ఎస్ నేతలు నీతులు వల్లించడం సరికాదన్నారు.
ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎ్‌సలో చేర్చుకుని, శాసనసభలో కాంగ్రె్‌సకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన విషయం తెలంగాణ ప్రజలు ఇంకా మరిచిపోలేదని చెప్పారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే గెలుపు కాంగ్రె్‌సదేనని, దానం అభ్యర్థిత్వంపై హైకమాండ్‌దే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పార్టీ ఫిరాయింపులను బీజేపీ కూడా ప్రోత్సహించిందని మండిపడ్డారు. కాగా, రాష్ట్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మూడు డీసీసీలకు కొత్త అధ్యక్షులను నియమించారు.సంఘటన్ సృజన్ అభియాన్ కింద రామగుండం కార్పొరేషన్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల నియామకాలకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఆమోదం తెలిపినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటనలో తెలిపారు. రామగుండం కార్పొరేషన్‌కు ఎండీ ముస్తఫా, రంగారెడ్డి జిల్లాకు చిగిరింత పారిజాత, సంగారెడ్డి జిల్లాకు పటోళ్ల చంద్రశేఖర్ రెడ్డిలను డీసీసీ అధ్యక్షులుగా నియమించినట్లు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
దానంపై తీర్పు రాజ్యాంగ విజయం
నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడం అభినందనీయం
Read Latest AP News And Telangana News And International News And Telugu News