Share News

అర్ధరాత్రి పబ్‌లో గ్యాంగ్‌వార్‌!

ABN , Publish Date - Sep 07 , 2026 | 06:21 AM

జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో.. సీఎం ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న ఓ పబ్‌లో అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య చిన్న వాగ్వాదం కాస్త తీవ్ర ఘర్షణకు దారి తీసింది. రోడ్డుపైకెక్కి 50 మంది యువకులు పరస్పరం పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు.

అర్ధరాత్రి పబ్‌లో గ్యాంగ్‌వార్‌!
CCTV Footage

  • టేబుల్‌ విషయమై రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ

  • రోడ్డుపై పరస్పర దాడులు.. భయభ్రాంతులకు గురైన స్థానికులు

  • ఎంపీ అనిల్‌ కుమార్‌యాదవ్‌ సోదరుడి హల్‌చల్‌..

  • సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలు

  • సుమోటోగా కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు

  • పబ్‌ గబ్బులో కాంగ్రెస్‌ యువ నేతలు: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌

బంజారాహిల్స్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో.. సీఎం ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న ఓ పబ్‌లో అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య చిన్న వాగ్వాదం కాస్త తీవ్ర ఘర్షణకు దారి తీసింది. రోడ్డుపైకెక్కి 50 మంది యువకులు పరస్పరం పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్‌ సోదరుడు అరవింద్‌యాదవ్‌ హల్‌చల్‌ చేశారు. వాహనదారులు, స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇరువర్గాలను చెదరగొట్టారు. దాడికి సంబంఽధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసుల వివరాల మేరకు.. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 36లోని దస్‌పల్లా హోటల్‌పై అంతస్తులో కారాకారా పబ్‌ ఉంది. శనివారం వీకెండ్‌ సందర్భంగా అరవింద్‌యాదవ్‌ తన స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత అరవింద్‌ వర్గానికి మరో వర్గంతో టేబుల్‌ విషయమై వివాదం తలెత్తింది. తమ టేబుల్‌ ఎందుకు ఇవ్వాలంటూ వాదన మొదలై.. మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దాంతో మద్యం మత్తులో ఉన్న ఇరు వర్గాల వారు తమ అనుచరులను అక్కడకు పిలిపించుకున్నారు. సుమారు 40-50 మంది అక్కడకు చేరుకొని పరస్పరం దాడులకు దిగారు. పబ్‌లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పబ్‌ నిర్వాహకులు పదే పదే హెచ్చరించినా వినిపించుకోలేదు. బౌన్సర్లు అడ్డుకున్నా ఆగలేదు.. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను బయటకు పంపించారు. అయితే రోడ్డు మీదకు వచ్చిన రెండు వర్గాలు మరోసారి పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. గొడవలో అరవింద్‌యాదవ్‌ ఉన్నట్టు తెలిసి పోలీసులు మొదట కేసు నమోదు చేసేందుకు వెనుకడుగు వేశారు. అంతేకాకుండా ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో మిన్నకుండిపోయారు. అయితే సోషల్‌ మీడియాలో గొడవ వీడియోలు వైరల్‌గా మారడంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. అలాగే అర్ధరాత్రి తర్వాత పబ్‌ తెరిచి ఉంచినందుకు నిర్వాహకులపై కూడా మరో కేసు నమోదుచేశారు. కాగా, కారాకారా పబ్‌ సీఎం ఇంటి పక్కనే ఉందని.. ఆయనకు తెలియకుండానే ఈ గలీజ్‌ సాగుతుందా? అని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. ‘హోం మంత్రి మన రేవంతన్న నే... పబ్బులల్ల.. డెన్నులల్ల ఎంత తన్నుకున్నా కేసులు పెట్టే దమ్ము ఎవరికీ లేదు..? అందుకే ఈ బరితెగింపు.. కాంగ్రెస్‌ యువ నేతలు ప్రజా పాలనలో పబ్బుల గబ్బులో మునిగి తేలుతున్నారు.. మహా నగర పోలీసు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఇవి నిజం కాకపోతే ఇంతవరకు ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు విడుదల కాలేదు..? నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదు? యూత్‌ కాంగ్రెస్‌ నేత అరవింద్‌ యాదవ్‌ ఎక్కడ?’ అంటూ పోలీసులను నిలదీశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జానపద నృత్యకారిణి మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నం?

త్వరలో మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి పాస్‌

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 07 , 2026 | 06:21 AM