Share News

జానపద నృత్యకారిణి మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నం?

ABN , Publish Date - Sep 07 , 2026 | 06:11 AM

జానపద నృత్యకారిణి మాధురి రాథోడ్‌ ఆత్మహత్యకు యత్నించారు. హైదరాబాద్‌, పుప్పాలగూడలోని తన నివాసంలో మాధురి రాథోడ్‌ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా.. గమనించిన కుటుంబసభ్యులు సకాలంలో కాపాడారని సమాచారం.

జానపద నృత్యకారిణి మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నం?
Madhuri Rathod

  • ఈశ్వర్‌సాయిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని మనస్తాపం!

  • అంతా తప్పుడు ప్రచారం అంటున్న నార్సింగి పోలీసులు

హైదరాబాద్‌ సిటీ/ నార్సింగి, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): జానపద నృత్యకారిణి మాధురి రాథోడ్‌ ఆత్మహత్యకు యత్నించారు. హైదరాబాద్‌, పుప్పాలగూడలోని తన నివాసంలో మాధురి రాథోడ్‌ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా.. గమనించిన కుటుంబసభ్యులు సకాలంలో కాపాడారని సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియోలతోపాటు, ఆమె రాసిన సూసైడ్‌ నోట్‌ అంటూ ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. జానపద కళాకారులు మాధురి రాథోడ్‌, ఈశ్వర్‌ సాయికి సంబంధించిన ఒక వివాదం కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆ ఘటన నేపథ్యంలో పెళ్లి చేసుకుంటానని తనని నమ్మించి ఈశ్వర్‌ సాయి తనని శారీరకంగా వాడుకొని మోసం చేశాడని, మార్ఫింగ్‌ వీడియోలతో వేధిస్తున్నాడని మాధురి నాలుగు రోజుల క్రితం నార్సింగి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఉండగా ఈశ్వర్‌ సాయి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నం వార్త కలకలం రేపింది. మరోపక్క, తన చావుకు ఈశ్వర్‌, శరణ్య, సంధ్య, సోషల్‌ మీడియాలో తనని ట్రోల్‌ చేసిన వారే కారణమని మాధురి రాథోడ్‌ రాసిన సూసైడ్‌ నోట్‌గా పేర్కొంటున్న లేఖలో ఉంది. కాగా, మాధురి రాథోడ్‌ ఆత్మహత్యకు యత్నించిన విషయం తమ దృష్టికి రాలేదని, అంతా తప్పుడు ప్రచారమని నార్సింగ్‌ పోలీసులు ఘటనను కొట్టి పారేస్తున్నారు. ఫాల్స్‌ న్యూస్‌ అంటూ పోలీసుస్టేషన్‌ వాట్సప్‌ గ్రూప్‌లో మీడియాకు సమాచారం పోస్టు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

త్వరలో మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి పాస్‌

రాష్ట్రంలో 369 పబ్లిక్‌ ఈవీ చార్జింగ్‌ కేంద్రాలు!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 07 , 2026 | 06:11 AM