ఆటో డైవ్రర్ల సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Sep 07 , 2026 | 01:03 AM
ఆటో డైవ్రర్ల సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ సమావేశాల్లో తమ తరఫున గళం వినిపిస్తామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో ఆటో ర్యాలీ నిర్వహించారు.
- ఎమ్మెల్యే గంగుల కమలాకర్
- 150 ఆటోలతో కరీంనగర్‌లో భారీ ర్యాలీ
గణేశనగర్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆటో డైవ్రర్ల సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ సమావేశాల్లో తమ తరఫున గళం వినిపిస్తామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లకు ఇస్తామని ప్రకటించిన 12 వేల ఆర్థిక సహాయాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రమాద బీమా పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరారు. డైవ్రింగ్ లైసెన్సుల విషయంలో చేసిన మార్పులను విరమించుకుని, గతంలో మాదిరిగానే ఆటో డైవ్రర్లకు లైసెన్సులు మంజూరు చేయాలన్నారు. ట్రాఫిక్ పోలీసుల వేధింపులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్‌టీయూ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, సంఘం ప్రధాన కార్యదర్శి బండారి సంపతపటేల్, నాయకులు కొత్తూరు సత్యనారాయణ, నరసింహ నాయక్, వడ్లకొండ శ్రీనివాస్‌గౌడ్, వాల్క రమేష్, మీర్జా అఫ్జల్‌బేగ్, మహమ్మద్ యాకూబ్, బీర్ల రాజు, కూర్మాచలం వేణుమాధవ్, వీర్ల పరమేశ్వర్ పాల్గొన్నారు.