కార్పొరేట్ శక్తులకు అండగా మోదీ ప్రభుత్వం
ABN , Publish Date - Sep 07 , 2026 | 01:05 AM
కార్పొరేట్ శక్తులకు, ప్రపంచ బ్యాంకు విధానాలకు అండగా మోదీ ప్రభుత్వం పని చేస్తోందని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్‌కౌర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కరీంనగర్‌లోని సర్కస్ గ్రౌండ్‌లో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) రాష్ట్ర 4వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
భగత్‌నగర్, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): కార్పొరేట్ శక్తులకు, ప్రపంచ బ్యాంకు విధానాలకు అండగా మోదీ ప్రభుత్వం పని చేస్తోందని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్‌కౌర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కరీంనగర్‌లోని సర్కస్ గ్రౌండ్‌లో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) రాష్ట్ర 4వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేసి కార్మిక చట్టాలను కాపాడాలన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ఏకైక ట్రేడ్ యూనియన్ ఎఐటియుసి అన్నారు. ఇప్పుడు దేశాన్నినిర్మించడం కోసం పోరాటం చేయాలన్నారు. ప్రస్తుత సమావేశంలో రాబోయే రోజుల్లో రూపొందించాల్సిన వ్యూహంపై చర్చించాలన్నారు. దేశంలో 70 శాతం మంది 35 సంవత్సరాల లోపు వయస్సు వారే ఉన్నారని, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు, రైతులు, వ్యాపారులు, యువత, మహిళలు సహనం కోల్పోతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో పోరాట మార్గాన్ని ఎంచుకోవడం తప్ప మరో మార్గం లేదని అన్నారు. దేశ సంపదను కార్మికులు, రైతులు, సాధారణప్రజలే సృష్టిస్తున్నారని, ఆసంపద సామాన్యుల సంక్షేమానికి ఉపయోగపడాలని అన్నారు.
ఫ పొత్తులు ఉన్నా ప్రజా సమస్యలపై పోరాటం
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంభశివరావు
రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తులు ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం తప్పదని, ప్రజల హక్కుల కోసం ఎర్ర జెండా పోరాటం చేస్తూనే ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మహాసభల సందర్భంగా ఆయన మాట్లాడారు. కమ్యునిస్టు పార్టీ ఏదైనా అన్నింటి ఇంటిపేరు సీపీఐగానే ఉంటుందన్నారు. అన్ని ఎర్ర జెండాలకు సీపీఐ నాయకత్వం వహించాలని ప్రజలు కోరుతున్నారన్నారు. ఆ రోజు తప్పకుండా వస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకించిన వేతనాల పెంపు కంటే కొన్ని కేటగిరీల్లో ప్రస్తుత వేతనాలే ఎక్కువ ఉన్నాయన్నారు. కనీస వేతనంతో పాటు ప్రతి ఒక్కరికి అదనంగా పది శాతం ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఫ లేబర్ కోడ్‌లు రదు ్దచేయక పోతే ఉద్యమం
- మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి
నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయక పోతే ఉద్యమం తప్పదని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. మోదీ ప్రభుత్వంలో కార్మికులకు అన్యాయం జరుగుతోందన్నారు. కార్మికుల జీవితాలతో కేంద్రప్రభుత్వం ఆటలాడుతోందన్నారు. ఆరోగ్య శాఖలో కాంట్రాక్టర్‌లు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు డబ్బులు ముట్టజెబుతున్నారని ఆరోపించారు. దోపిడీ జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేక పోతే ఇప్పటి వరకు మిత్ర పక్షంగా ఉన్నామని, ఇక ముందు ప్రజల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఫ దేశంలో రాజ్యాంగ ఉల్లంఘన
- సినీ హీరో నారాయణమూర్తి
దేశంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారని సినీ హీరో నారాయణ మూర్తి అన్నారు. అభవృద్ధి పేరుతో దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతున్నారన్నారు. పోరాడితే పోయేదేమీ, లేదని సీపీఐ పార్టీ తల్లిలాంటిదని, కలిసి కృషి చేస్తే ఢిల్లీలో ఎర్రెండా ఎగురవేస్తామని అన్నారు. రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన హక్కులు కాలరాస్తున్నారన్నారు.
ఫ కార్మిక చట్టాల రద్దు దుర్మార్గం
- ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్
కార్మిక చట్టాల రద్దు దుర్మార్గమైన చర్య అని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ విధానాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికుల హక్కులను హరించి వేస్తోందన్నారు. సమావేశంలో తాళ్లపల్లి శ్రీనివాసరావు, కలవేన శంకర్, టేకుమల్ల సమ్మయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, వివిధ జిల్లాల ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు, ఆఫీస్ బేరర్లు, తదితరులు పాల్గొన్నారు.