Share News

3.15 ఎకరాల భూ వేలం అడ్డుకోవాలని పిల్‌

ABN , Publish Date - Nov 26 , 2026 | 05:30 AM

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి మండలం మూసాపేట్‌ గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 121/పీ నుంచి 157 వరకు పలు సర్వేనెంబర్లలో ఉన్న హుడా ట్రక్‌ పార్కింగ్‌ స్థలాన్ని ప్రభుత్వం వేలానికి పెట్టిందని..

3.15 ఎకరాల భూ వేలం అడ్డుకోవాలని పిల్‌

హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి మండలం మూసాపేట్‌ గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 121/పీ నుంచి 157 వరకు పలు సర్వేనెంబర్లలో ఉన్న హుడా ట్రక్‌ పార్కింగ్‌ స్థలాన్ని ప్రభుత్వం వేలానికి పెట్టిందని.. ఈ వేలం ఈనెల 27న జరగనున్న నేపథ్యంలో దానిని అడ్డుకోవాలని పేర్కొంటూ కూకట్‌పల్లి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.


హైదరాబాద్‌ - ముంబై నేషనల్‌ హైవేపై ట్రక్కుల పార్కింగ్‌ కోసం సదరు స్థలాన్ని భూసేకరణ ద్వారా 1985లో సేకరించారని.. రావాణ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే ఉద్దేశంతో ఆ స్థలాన్ని పార్కింగ్‌కు అప్పటి ప్రభుత్వాలు కేటాయించాయని పిటిషనర్‌ గుర్తుచేశారు. దీనిపై తాను ముఖ్యమంత్రికి ఈనెల 17న విజ్ఞాపన అందజేశానని.. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఈనెల 27న వేలం నిర్వహిస్తోందని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఇదే భూమి వేలం నిలిపేయాలని పేర్కొంటూ సోషల్‌ వర్కర్‌ మాధవరం కాంతారావు మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లు గురువారం డివిజన్‌ బెంచ్‌ ఎదుట విచారణకు రానున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 05:30 AM