Share News

ఫిరాయింపులపై కేటీఆర్ మాట్లాడటం విడ్డూరం: మంత్రి సీతక్క

ABN , Publish Date - Mar 11 , 2026 | 03:27 PM

మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్‌ఎస్‌పై మంత్రి సీతక్క విరుచుకుపడ్డారు. ఫిరాయింపులపై కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

ఫిరాయింపులపై కేటీఆర్ మాట్లాడటం విడ్డూరం: మంత్రి సీతక్క
Minister Seethakka

హైదరాబాద్, మార్చి 11: బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పుపై మంత్రి సీతక్క(Minister Seethakka) స్పందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫిరాయింపులపై మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కేటీఆర్.. ముందు క్షమాపణలు చెప్పి మాట్లాడాలని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకున్నారని.. మండలి చైర్మన్ పదవి లాగేసుకున్నారని గుర్తుచేశారు.


తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డిలకు నేరుగా మంత్రి పదవులు ఇచ్చిన విషయాన్ని కేటీఆర్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. కేటీఆర్ నీతి మంతుడైనట్టు మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ తన పరిధి మేరకే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ‘బీఆర్ఎస్ తీసుకుంటే అభివృద్ధి కోసం.. కాంగ్రెస్ తీసుకుంటే ప్రజాస్వామ్యంపై దాడా’ అంటూ మంత్రి మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలకు సిగ్గుండాలని అంటూ మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందే బీఆర్‌ఎస్: టీపీసీసీ చీఫ్

mahesh-kumar-goud.jpg

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందే బీఆర్ఎస్ అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఫిరాయింపుల గురించి కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. స్పీకర్ తన అధికార పరిధిలోనే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కేటీఆర్, హరీష్ రావు ఏం మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందే బీజేపీ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుందనే ప్రజలు ఆశీర్వదిస్తున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఏపీలో జరిగిన ఘటనలపై సీఎం ఆవేదన.. వారేం చేస్తున్నారంటూ ప్రశ్న

బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా.. కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నా: కడియం శ్రీహరి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 11 , 2026 | 03:41 PM