Share News

ఢిల్లీకి కాంగ్రెస్‌ సంచులు మోస్తే.. బీజేపీ చెప్పులు మోస్తోంది

ABN , Publish Date - Nov 05 , 2026 | 05:38 AM

ఢిల్లీ పార్టీల వల్ల తెలంగాణకు ఏనాడు న్యాయం జరగలేదని, కాంగ్రెస్‌ సంచులు మోసే పార్టీ అయితే.. బీజేపీ చెప్పులు మోసే పార్టీగా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.

ఢిల్లీకి కాంగ్రెస్‌ సంచులు మోస్తే.. బీజేపీ చెప్పులు మోస్తోంది
KTR

  • ప్రియాంక సెక్యూరిటీ తోయడంతోనే..

  • రేవంత్‌రెడ్డి గౌరవం ఏంటో తేలిపోయింది

  • అమిత్‌ షా ముందు బండి సంజయ్‌ బౌన్సర్‌ : కేటీఆర్‌

హైదరాబాద్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ పార్టీల వల్ల తెలంగాణకు ఏనాడు న్యాయం జరగలేదని, కాంగ్రెస్‌ సంచులు మోసే పార్టీ అయితే.. బీజేపీ చెప్పులు మోసే పార్టీగా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఆ రెండు పార్టీలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, రాష్ట్ర హక్కులను ఢిల్లీ పార్టీల నాయకత్వాల ముందు తాకట్టు పెడుతున్నాయని మండిపడ్డారు. ఢిల్లీ పెద్దల ముందు ఆ రెండు పార్టీల తెలంగాణ నాయకులు భయంతో వణుకుతున్నారని, రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని ప్రియాంక గాంధీ బౌన్సర్లు నెట్టివేసే పరిస్థితి రావడం కాంగ్రెస్‌లో ఆయనకు ఇస్తున్న గౌరవం ఏంటో తెలియజేస్తోందన్నారు.


రేవంత్‌ రెడ్డి వారానికి రెండుసార్లు ఢిల్లీకి వెళ్తున్నారని, పాలన కంటే ఢిల్లీ పర్యటనలు, స్వంత రాజకీయ ప్రయోజనాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్న ఒక ఈఎంఐ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను తిట్టడం తప్ప రేవంత్‌రెడ్డికి పాలనపై దృష్టి లేదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అమిత్‌ షా ముందు బౌన్సర్‌లా తయారయ్యారని, బీజేపీ రాష్ట్ర చీఫ్‌ రాంచందర్‌రావు తనకంటే వయసులో చిన్నవాడైన అమిత్‌ షా కాళ్లకు నమస్కరించాల్సిన పరిస్థితి రావడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దిగజార్చడమేనన్నారు. మియాపూర్‌లోని 550 ఎకరాల భూములను కోర్టు తీర్పు వచ్చిన 24 గంటల్లోనే అమ్మేస్తామని ప్రకటించడం వెనుక కమీషన్ల ఆంతర్యం ఉందని, ఆ భూములను తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, హైదరాబాద్‌ పేదలకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. భూ దందాలు, కమీషన్ల కోసమే ఎమ్మెల్యే గాంధీ రేవంత్‌రెడ్డి పంచన చేరారని ఆయన ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కండక్టర్‌ ప్రవళికకు కన్నీటి వీడ్కోలు

స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలకు ఇక సులువుగా ఫైర్‌ ఎన్‌వోసీ!

7 గంటల్లో రూ.7.80 కోట్లు స్వాహా

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 05:38 AM