Share News

తెలంగాణ అసెంబ్లీ... భట్టి విక్రమార్కకు కేటీఆర్ సవాల్

ABN , Publish Date - Mar 17 , 2026 | 02:09 PM

మహిళా సంఘాలకు రూ.57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు అసెంబ్లీలో భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. రుణాలు ఇచ్చినట్లు జీవో చూపిస్తే రాజీనామాకు సిద్ధమన్నారు కేటీఆర్.

తెలంగాణ అసెంబ్లీ... భట్టి విక్రమార్కకు కేటీఆర్ సవాల్
Telangana Assembly Session

హైదరాబాద్, మార్చి 17: తెలంగాణ శాసనసభలో(Telangana Assembly Session) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. మహిళా సంఘాలకు రూ.57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు అసెంబ్లీలో భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ‘రూ.57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు జీవో చూపించండి. ఇక్కడే రాజీనామా చేసి నేను వెళ్లిపోతాను’ అంటూ సవాల్ విసిరారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించవద్దంటూ డిప్యూటీ సీఎంకు సూచించారు. భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు అబద్ధమని.. రాష్ట్రంలోని మహిళలంతా చూస్తున్నారని కేటీఆర్ అన్నారు.


దీనిపై మంత్రి సీతక్క స్పందిస్తూ.. మహిళా సంఘాలు ఐదు లక్షల కంటే ఎక్కువ తీసుకోకుండా బారికేడ్లు పెట్టారని.. ఇప్పుడు ఆ బారికేడ్లను తొలగిస్తున్నామని చెప్పారు. ఎవరి హయాంలో మహిళా సంఘాలు బాగా నడుస్తున్నాయో వెళ్లి మహిళలను అడగాలని మంత్రి సవాల్ చేశారు. అభయ హస్తం డబ్బులను కూడా గత ప్రభుత్వం వాడుకుందని సీతక్క ఆరోపించారు.


ఆ ఆలోచన మంచిది కాదు: డిప్యూటీ సీఎం

కేటీఆర్ దారి తప్పి మాట్లాడుతున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. ‘పదేళ్లు అధికారంలో ఉండి మహిళా సాధికారతను గాలికి వదిలేశారు. మీ ఇంటి ఆడబిడ్డపై మీకు ఏ గౌరవం ఉందో రాష్ట్రమంతా చూస్తోంది. కానీ రాష్ట్ర మహిళల గౌరవంపై చిన్న చూపు వద్దు. రాష్ట్రాన్ని అభాసుపాలు చేయాలనే ఆలోచన మంచిది కాదు’ అని భట్టి విక్రమార్క అన్నారు.


సోనియాను బలిదేవత అనలేదు: కేటీఆర్

రూ.57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నది తప్పు మాట అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. వంద రోజుల్లో 6 గ్యారంటీలని సినిమా చూపించిందే కాంగ్రెస్ అని.. సోనియా గాంధీని బలిదేవత అని తాము అనలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. వెంటనే శ్రీధర్ బాబు స్పందిస్తూ.. ఈ విషయాన్ని కేటీఆర్ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. టెక్నికల్‌గా మాట్లాడితే బీఆర్ఎస్ ఒక్క రూపాయి కూడా రుణం ఇవ్వలేదన్నారు. మహిళలంటే ఎందుకు చులకన అని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి..

అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు.. అడ్డుకున్న భద్రతా సిబ్బంది.. ఎందుకంటే

తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 17 , 2026 | 02:24 PM