Share News

అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు.. అడ్డుకున్న భద్రతా సిబ్బంది.. ఎందుకంటే

ABN , Publish Date - Mar 17 , 2026 | 10:33 AM

ప్రజాపాలన దరఖాస్తులతో అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు, భద్రతా సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు.. అడ్డుకున్న భద్రతా సిబ్బంది.. ఎందుకంటే
Telangana Assembly Session

హైదరాబాద్, మార్చి 17: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly Session) ఎంట్రీ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు(BJP MLAs) తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజా పాలన దరఖాస్తులతో అసెంబ్లీకి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు... ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద బీజేపీ ఎమ్మెల్యేలను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. పేపర్ కట్టలు లోపలికి తీసుకెళ్లడానికి అనుమతి లేదని భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యేలు తీవ్రంగా వాదించారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు, పోలీసు-భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు భద్రతా సిబ్బంది పేపర్ బండిల్స్‌ను తీసుకొని బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ లోపలికి అనుమతించారు. అసెంబ్లీ ఎంట్రీ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.


కాగా.. రైతు సమస్యలపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నిరసనకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈనెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆదిలాబాద్ కేంద్రంగా బీజేపీ ఎమ్మెల్యే పర్యటించారు. రైతుల నుంచి పంటల బీమా పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. రైతులు ఎదుర్కొంటున్న పంట నష్టాలకు తగిన న్యాయం జరగాలంటే బీమా పథకం అమలు అవసరమని బీజేపీ ఎమ్మెల్యే పట్టుబట్టారు. వెంటనే రైతుబంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

హైదరాబాద్ మియాపూర్‌లో ప్రైవేట్ మినీ బస్ బోల్తా

డ్రగ్స్ కేసు.. పైలెట్‌ రోహిత్‌ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 17 , 2026 | 11:20 AM