హైదరాబాద్ మియాపూర్‌లో ప్రైవేట్ మినీ బస్ బోల్తా
ABN , Publish Date - Mar 17 , 2026 | 09:24 AM
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఓ ప్రైవేట్ మినీ బస్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు.
హైదరాబాద్, మార్చి 17: నగరంలోని మియాపూర్‌లో ఓ ప్రైవేట్ మినీ బస్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో పది మంది ప్రైవేటు ఉద్యోగులు ఉన్నారు. వారందరూ గాయపడటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈరోజు(మంగళవారం) ఉదయం లీ ఫార్మా కంపెనీకి చెందిన మినీ బస్సు కూకట్‌పల్లి నుంచి 10 మంది ఉద్యోగులతో గడ్డపోతారం వెళ్తోంది. బాచుపల్లి సమీపంలోని మలుపు వద్ద బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులోని ఉద్యోగులకు గాయాలయ్యాయి.
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
పశ్చిమాసియాలోకి ‘డూమ్స్ డే’ విమానాలు’!
మూసీ సుందరీకరణతో నయా హైదరాబాద్
Read Latest Telangana News And Telugu News