Share News

ఆర్డీటీ లైసెన్స్‌ పునరుద్ధరణకు చొరవచూపండి

ABN , Publish Date - Mar 17 , 2026 | 06:45 AM

అనంతపురం జిల్లాకు చెందిన రూరల్‌ డెవల్‌పమెంట్‌ ట్రస్ట్‌ (ఆర్డీటీ)కు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్‌సీఆర్‌ఏ) కింద లైసెన్స్‌ పునరుద్ధరణకు చొరవ తీసుకోవాలని...

ఆర్డీటీ లైసెన్స్‌ పునరుద్ధరణకు చొరవచూపండి

  • కేంద్ర మంత్రి రామ్మోహన్‌తో పయ్యావుల

న్యూఢిల్లీ, మార్చి 16(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లాకు చెందిన రూరల్‌ డెవల్‌పమెంట్‌ ట్రస్ట్‌ (ఆర్డీటీ)కు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎ్‌ఫసీఆర్‌ఏ) కింద లైసెన్స్‌ పునరుద్ధరణకు చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుకి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ విజ్ఞప్తి చేశారు. హిందూపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, రాజ్యసభ ఎంపీ సానా సతీష్‌తో కలిసి సోమవారం పార్లమెంటులో రామ్మోహన్‌తో మంత్రి పయ్యావుల భేటీ అయ్యారు. ఆర్డీటీ కార్యకలపాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఎదురవుతున్న పరిపాలనా అడ్డంకులపై చర్చించారు. ప్రస్తుతం కొన్ని పరిపాలనా సమస్యల కారణంగా ట్రస్ట్‌ కార్యకలాపాలు ప్రభావితమవుతున్న నేపథ్యంలో ఆ అడ్డంకులను త్వరితగతిన తొలగించేందుకు కేంద్రం సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక సహాయం, రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధుల కోసం కేంద్ర ఆర్థిక శాఖలోని వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతోనూ పయ్యావుల భేటీ అయ్యారు.

Updated Date - Mar 17 , 2026 | 06:48 AM