Share News

వైసీపీ ఇన్‌చార్జ్ వీరంగం.. భయాందోళనలో ప్రజలు

ABN , Publish Date - Mar 17 , 2026 | 08:28 AM

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో.. వైసీపీ అధికారానికే కాదు.. ప్రతిపక్షా హోదాకి సైతం దూరమైంది.

వైసీపీ ఇన్‌చార్జ్ వీరంగం.. భయాందోళనలో ప్రజలు

బాపట్ల, మార్చి 17: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో.. వైసీపీ అధికారానికే కాదు.. ప్రతిపక్షా హోదాకి సైతం దూరమైంది. అయినా ఆ పార్టీ నేతల్లో ఇంకా దుందుడుకు స్వభావం తగ్గలేదనే ప్రచారం సర్వత్రా వినిపిస్తోంది. తాజాగా బాపట్ల జిల్లాలో ఆ పార్టీ శ్రేణులు మరోసారి రెచ్చిపోయారు. రేపల్లెలో స్థానిక వైసీపీ ఇన్‌చార్జ్ పీఠా నాగ మోహన్ కృష్ణ హల్‌చల్ చేశారు. పట్టణంలో తమ పార్టీకి చెందిన ఫ్లెక్సీల తొలగింపుతో మున్సిపల్ సిబ్బందిపై ఆయన నిప్పులు చెరిగారు.


తన అనుచరులతో కలిసి రేపల్లెలో రప్పా ... రప్పా అంటూ ఆయన భారీ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అదే సమయంలో పట్టణ రహదారుల్లో కనిపించిన టీడీపీ ఫ్లెక్సీలను వైసీపీ కేడర్ చించేసింది. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులను పట్టణ సీఐ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయనపై సైతం వైసీపీ శ్రేణులు దురుసుగా ప్రవర్తించారు. నీ అంతు చూస్తానంటూ సీఐకి వైసీపీ ఇన్‌చార్జ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో రేపల్లె పట్టణ ప్రజల్లో ఒక విధమైన భయాందోళనలు నెలకొన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

కొత్త అమావాస్య వేళ.. పొరపాటున కూడా ఇలా చేయవద్దు?

శ్రీశైలంలో నేటి నుంచి ఉగాది మహోత్సవాలు

For More AP News And Telugu News

Updated Date - Mar 17 , 2026 | 10:11 AM