డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్‌ఎస్ మద్దతు.. ఎక్స్‌లో కేటీఆర్ ప్రకటన
ABN , Publish Date - Nov 28 , 2026 | 03:47 PM
డీలిమిటేషన్ బిల్లుపై బీఆర్‌ఎస్ వైఖరిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
హైదరాబాద్, నవంబర్ 28: డీలిమిటేషన్ బిల్లుపై బీఆర్‌ఎస్ వైఖరిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. డీలిమిటేషన్ బిల్లుకు రాజ్యసభలో బీఆర్‌ఎస్ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారన్నారు. డీలిమిటేషన్‌పై తమ వైఖరి ఎప్పుడూ స్పష్టంగానే ఉందని చెప్పుకొచ్చారు. పార్లమెంట్‌లో దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గకూడదన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే సహించేదిలేదని స్పష్టం చేశారు.
పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న 24శాతం ప్రాతినిధ్య వాటా కొనగించాలని తాము మొదటి నుంచీ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. లోక్‌సభ స్థానాలకు 50 శాతం పెంచడంతోపాటూ 2051 వరకు అంతర్రాష్ట్ర ప్రాతినిధ్య నిష్పత్తి మారకుండా రక్షణ కల్పించే ప్రతిపాదన తమ ప్రధాన ఆందోళనకు పరిష్కారంగా ఉందని అన్నారు. ఈ ప్రతిపాదనలతో తెలంగాణ లోక్‌సభ స్థానాలు ప్రస్తుతం ఉన్న 17 నుంచి 26కు పెరుగుతాయని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లకు కూడా బీఆర్‌ఎస్ ఎప్పుడూ మద్దతుగా ఉందని.. దాని అమలుకు కట్టుబడి ఉన్నామని ఎక్స్‌లో కేటీఆర్ పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి
Read Latest Telangana News And Telugu News