Share News

కొడంగల్‌ ఎత్తిపోతల పథకం.. అంచనా వ్యయం ఐదు రెట్లు పెరిగింది: కేటీఆర్‌

ABN , Publish Date - Nov 08 , 2026 | 05:15 AM

కొడంగల్‌-నారాయణపేట-మక్తల్‌ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం ఐదు రెట్లు పెరిగిందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు.

కొడంగల్‌ ఎత్తిపోతల పథకం.. అంచనా వ్యయం ఐదు రెట్లు పెరిగింది: కేటీఆర్‌
KTR

హైదరాబాద్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): కొడంగల్‌-నారాయణపేట-మక్తల్‌ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం ఐదు రెట్లు పెరిగిందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. తొలుత రూ.1,450 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు వ్యయం ప్రస్తుతం ఏకంగా రూ.6,825 కోట్లకు చేరిందన్నారు. అయినా ఇప్పటివరకు చుక్క నీరు కూడా అందలేదని విమర్శించారు.


ఈ ప్రాజెక్టు టెండర్లలో మంత్రి పొంగులేటికి చెందిన కంపెనీ కూడా పాల్గొన్నట్లు ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ సంపదను దోచుకుంటున్నారని విమర్శించారు. ఈ తరహా దోపిడీకి సరిపోయే కొత్త పదాన్ని సూచించగలరా? అంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని ఉద్దేశించి ఎక్స్‌లో ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సంక్రాంతి తర్వాత ప్రజాబలం

రావిర్యాల భూములు బ్లాక్‌లో

వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 05:15 AM