‘ఏఐ’ని భూతంగా చిత్రీకరించడం సరికాదు
ABN , Publish Date - Oct 25 , 2026 | 06:35 AM
ఏఐ (కృత్రిమ మేధ)ను భూతంగా చిత్రీకరించడం సరికాదని, యువతలో భయాలు కాదని, భరోసాను నింపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
పెట్టుబడులకు ప్రోత్సాహకర వాతావరణాన్ని కల్పించి
హైదరాబాద్‌ను గ్లోబల్ ఏఐ హబ్‌గా తీర్చిదిద్దాలి: కేటీఆర్
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఏఐ (కృత్రిమ మేధ)ను భూతంగా చిత్రీకరించడం సరికాదని, యువతలో భయాలు కాదని, భరోసాను నింపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏఐతో ఉద్యోగాలు పోవని, కొత్త ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని తెలిపారు. ‘ర్యాండం ట్రీస్’ అనే కంపెనీ 400 మంది సిబ్బందితో భారతదేశ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో శనివారం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులకు అడ్డంకులు సృష్టించకుండా, ప్రోత్సాహకర వాతావరణాన్ని కల్పించాలన్నారు.
గత పదేళ్ల ఐటీ ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్తూ.. హైదరాబాద్‌ను గ్లోబల్ ఏఐ హబ్‌గా తీర్చిదిద్దాలన్నారు. ప్రస్తుతమున్న కంపెనీలకు మౌలిక వసతులు కల్పించి, వాటి కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా ఉండాలని అభిప్రాయపడ్డారు. నిజానికి ప్రైవేటు రంగం విస్తరణతోనే యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఏఐ అనేక కొత్త అవకాశాలను కల్పిస్తోందని, వాటిని అందిపుచ్చుకునేలా యువత తమను తాము తీర్చిదిద్దుకోవాలని ఆయన అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News