కొండా సురేఖ విషయంలో హైకమాండ్ నిర్ణయమే ఫైనల్: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
ABN , Publish Date - Sep 03 , 2026 | 01:36 PM
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అంశంలో పార్టీ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఆమె విషయంలో పార్టీ హైకమాండ్ వద్ద పూర్తి సమాచారం ఉందని అన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 03: తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అంశంలో పార్టీ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఆమె విషయంలో పార్టీ హైకమాండ్ వద్ద పూర్తి సమాచారం ఉందని అన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణలో ఎవరికీ చోటు ఉంటుందనేది పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని తెలిపారు. హైకమాండ్ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని పార్టీ నేతలతోపాటు శ్రేణులకు ఆయన సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు పోరాటం చేసిన కార్యకర్తలకు న్యాయం జరగాలని ఈ సందర్భంగా పార్టీ అధిష్ఠానానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కొండా సురేఖ జన్మదినం సందర్భంగా వరంగల్ జిల్లాలోని గీసుకొండలో ఆమె జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఆమె కుమార్తె సుస్మిత పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవి వైరల్ అయ్యాయి. కొండ సురేఖ కుమార్తె వ్యాఖ్యలపై పార్టీలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కొండా సురేఖకు పార్టీ నోటీసులు జారీ చేసింది.
పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా స్పందించింది. దీంతో క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ లేఖల ద్వారా వివరణ ఇచ్చారు. అయితే కొండా సురేఖపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహంతో ఉందని.. తీవ్ర నిర్ణయం తీసుకుంటుందనే చర్చ నడుస్తోంది. మరో వైపు సీఎం రేవంత్ రెడ్డి.. తన కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ కేబినెట్‌లోకి కొత్త వారిని తీసుకుంటారనే చర్చ కూడా నడుస్తుంది. దీంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విధంగా స్పందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సస్పెన్షన్ వేటు పడిన డీఎస్పీ భీమ్‌రెడ్డికి మరో షాక్
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయం: ఎంపీ కేశినేని చిన్ని
For More TG News And Telugu News