Share News

నువ్వేం ఎస్సైవి.. ఉంటవా.. పోతవా..!

ABN , Publish Date - Nov 02 , 2026 | 06:18 AM

‘ఏం ఎస్సైవి నువ్వు.. ఉంటవా.. పోతవా..? ఇక్కడ పనిచేయాలంటే ఒకటే కండీషన్‌.. బెల్ట్‌షాపులను కంట్రోల్‌ చేసేందుంటేనే ఉండు.. లేదంటే ఇక్కడ నీ అవసరం లేదు’ అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చండూరు ఎస్సై శివకుమార్‌కుఫోన్‌ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

నువ్వేం ఎస్సైవి.. ఉంటవా.. పోతవా..!
Komatireddy Raj Gopal Reddy

  • బెల్ట్‌షాపులను అరికట్టలేకుంటే వెళ్లిపో

  • చండూరు ఎస్సైపై ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహం

చండూరు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ‘ఏం ఎస్సైవి నువ్వు.. ఉంటవా.. పోతవా..? ఇక్కడ పనిచేయాలంటే ఒకటే కండీషన్‌.. బెల్ట్‌షాపులను కంట్రోల్‌ చేసేందుంటేనే ఉండు.. లేదంటే ఇక్కడ నీ అవసరం లేదు’ అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చండూరు ఎస్సై శివకుమార్‌కుఫోన్‌ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. చండూరు మండలంలో దొంగచాటుగా నడుస్తున్న బెల్డ్‌షాపులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ఆయన మండిపడ్డారు. వారం రోజుల్లోగా అన్ని బెల్ట్‌ షాపులను మూసేయాలని ఎస్సైని ఆదేశించారు.


మునుగోడు నియోజకవర్గంలో పనిచేయాలంటే బెల్ట్‌ షాపులను నియంత్రించడమే మొదటి షరతు అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మండలంలోని 19 గ్రామాల్లో ఎంత మంది దొంగ చాటుగా మద్యం విక్రయిస్తున్నారో లిస్టు తీసుకుని ఈనెల 10వ తేదీన తన వద్దకు రావాలని ఎస్సైని ఆదేశించారు. వాటిని ఎలా బంద్‌ చేయించాలో తాను చూసుకుంటానని చెప్పారు. మద్యం మహమ్మారితో గ్రామాల్లో ఎన్నో పేద కుటుంబాలు, యువత నాశనమవుతోందని.. చట్టవిరుద్ధమైన బెల్ట్‌ షాపులను మూయించడం సామాజిక బాధ్యతని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎస్సైకి ఫోన్‌ చేసి స్వయంగా మాట్లాడిన వీడియోను ఎమ్మెల్యే తన అధికారిక సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పోస్ట్‌ చేయగా.. అది వైరల్‌గా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి..

అవగాహనతోనే సైబర్‌ నేరాలకు చెక్‌

పండగ ముందు.. మిఠాయి చేదు!

చుక్కను పట్టి.. పచ్చని వనమై!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 02 , 2026 | 06:18 AM