రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తుమ్మల
ABN , Publish Date - Nov 12 , 2026 | 04:53 PM
హైదరాబాద్ పరిధిలోని కొహెడలో ఇంటిగ్రేటెడ్ (సమీకృత) ఫ్రూట్ మార్కెట్ నిర్మాణంపై రాష్ట్ర మార్కెటింగ్, వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 12: నగర శివారులోని కొహెడలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణ పనులపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ఆదేశాలు జారీ చేశారు. 2027 మార్చి నాటికి మొదటి దశ పనులు పూర్తి చేయాలని డెడ్‌లైన్ పెట్టిన మంత్రి.. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు.
కొహెడ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణ పనులపై మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 2027 మార్చి నాటికి మొదటి దశ పనులు పూర్తి చేయాలని డెడ్‌లైన్ పెట్టారు. ఈ క్రమంలో 2028 జూన్ 2 నాటికి పూర్తిస్థాయి మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో జాప్యం జరిగితే కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు తీసుకునేలా నిబంధనలను సవరించాలని సూచించారు. నిర్మాణ నాణ్యత విషయంలో రాజీ పడొద్దని మంత్రి స్పష్టం చేశారు. కాగా.. మార్కెట్ నిర్మాణ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలతో మార్కెట్‌ను నిర్మించాలని సూచించారు. పండ్ల నిల్వ, విక్రయాలు, దేశీయ, అంతర్జాతీయ రవాణాకు ప్రత్యేక సదుపాయాలు కల్పించే విధంగా నిర్మాణం చేపట్టాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
ఏపీకి రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు.. విశాఖ సీఐఐ సదస్సులో చంద్రబాబు ప్రకటన
1,053 కి.మీ తీరప్రాంతం ఏపీకి వ్యూహాత్మక బలం: మంత్రి బీసీ జనార్దన్
Read Latest AP News And Telugu News