Share News

ఎన్నికల కమిషన్ తీరు.. కంచే చేను మేసినట్టుంది: కోదండరాం

ABN , Publish Date - Oct 02 , 2026 | 02:43 PM

కంచే చేను మేసినట్టు.. ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందని టీజేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఈసీ అక్రమాల నేపథ్యంలో అవకతవకలతో జరుగుతున్న 'సర్' ప్రక్రియను ఆపేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్నికల కమిషన్ తీరు.. కంచే చేను మేసినట్టుంది: కోదండరాం
tjac chairman kodandaram on election commission of india

హైదరాబాద్, అక్టోబర్ 2: కంచే చేను మేసినట్టు.. ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందని టీజేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఈసీ అక్రమాల నేపథ్యంలో అవకతవకలతో జరుగుతున్న 'సర్' ప్రక్రియను ఆపేయాలని ఆయన డిమాండ్ చేశారు.


రాజ్యాంగం ఎన్నికల సంఘానికి స్వతంత్ర్య ప్రతిపత్తి కల్పించిందని.. కానీ కమిషన్ మాత్రం అధికారంలో ఉన్నవారు చెప్పినట్టు చేస్తోందని కోదండరాం ఆరోపించారు. ఈసీ.. సమావేశాలు నిర్వహించకుండా, రాజ్యాంగ విరుద్ధంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన మండిపడ్డారు. ఇలా చేస్తే ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటాయన్నారు. ఓటు హక్కు ద్వారానే పౌరుల హక్కులను కాపాడగలమని.. అటువంటి ఓటుహక్కును ఎన్నికల కమిషన్ ఇష్టానుసారంగా తొలగిస్తోందని విమర్శించారు. అవకతవకలతో జరుగుతున్న 'సర్' ప్రక్రియను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో పని విధానం ఉండాలన్నారు. ప్రజల హక్కులకు భంగం కలిగితే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

నెల్లూరులో పొట్టేపాళెం వంతెన ప్రారంభం.. నెరవేరిన నాలుగు నియోజకవర్గాల ప్రజల కల

‘కెప్టెన్ మచ్చార్ ధైర్యాన్ని ఎందుకు మెచ్చుకోలేదు’.. కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 05:46 PM