ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు 8 వేల మంది క్రీడాకారులు.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
ABN , Publish Date - Nov 27 , 2026 | 04:23 PM
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏర్పాట్లపై సచివాలయంలో సీఎస్ సంజయ్ జాజు సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ ఆదేశించారు.
హైదరాబాద్, నవంబర్ 27: ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏర్పాట్లపై సచివాలయంలో సీఎస్ సంజయ్ జాజు సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ ఆదేశించారు. డిసెంబర్ 8న భారత్ ఫ్యూచర్ సిటీలో రక్షణ రంగ ఎక్స్పో, ఎయిర్ షో నిర్వహించనున్నట్లు తెలిపారు. రక్షణ రంగ ఎక్స్పో, ఎయిర్ షోను వీక్షించేందుకు భారీ సంఖ్యలో విద్యార్థులను తరలించాలని ఆదేశించారు. డిసెంబర్ 11న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభోత్సవానికి విద్యార్థుల హాజరుపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని తెలిపారు.
విద్యార్థుల రాకపోకల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని TGSRTCకి సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే విద్యార్థులకు భోజనం, అల్పాహారం, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో సుమారు 8 వేల మంది క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. క్రీడాకారులకు వసతి, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రారంభ, ముగింపు వేడుకల ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండకూడదని ఆదేశించారు. ఖేలో ఇండియా పోటీలకు విస్తృత మీడియా కవరేజీ కల్పించాలని అధికారులకు సీఎస్ సంజయ్ జాజు సూచనలు చేశారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్ ఫిష్ మార్కెట్లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు.. కుళ్లిన చేపల స్వాధీనం
డిసెంబర్‌లోగా డీలిమిటేషన్ బిల్లు పాస్ కాకపోతే.. జనాభా ఆధారంగానే సీట్ల పెంపు: ఎంపీ లక్ష్మణ్
Read Latest Telangana News And Telugu News