Share News

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు ప్రచారం కల్పించండి: తెలంగాణ సీఎస్ సంజయ్ జాజు

ABN , Publish Date - Nov 16 , 2026 | 05:59 PM

ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో రాష్ట్ర సీఎస్ సంజయ్ జాజు అధికారులతో సమావేశమయ్యారు. గేమ్స్ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి.. పలు సూచనలు తెలియజేశారు.

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు ప్రచారం కల్పించండి: తెలంగాణ సీఎస్ సంజయ్ జాజు
cs sanjay jaju on khelo india youth games

హైదరాబాద్, నవంబర్ 16: ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో రాష్ట్ర సీఎస్ సంజయ్ జాజు అధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు. గేమ్స్ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి.. పలు సూచనలు తెలియజేశారు. కాగా.. డిసెంబర్ 11 నుంచి 22 వరకు హైదరాబాద్‌తో పాటు హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌ ఐదు నగరాల్లో ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలకు సుమారు 8 వేల మంది క్రీడాకారులు, ప్రతినిధులు రానున్నట్లు సమాచారం.


ఈ నేపథ్యంలో అన్నీ జిల్లాల కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ జాజు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా.. గేమ్స్ నిర్వహణ నేపథ్యంలో అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ‘క్రీడలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా టార్చ్ ర్యాలీలు నిర్వహించాలి. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో విస్తృత ప్రచారం చేయాలి. హోర్డింగులు, మస్కట్, లోగోలను ఏర్పాటు చేయడం ద్వారా ఖేలో ఇండియా గేమ్స్‌కు ప్రచారం కల్పించాలి.

క్రీడాకారులకు నాణ్యమైన వసతి, ప్రత్యేక రవాణా సౌకర్యాలు కల్పించాలి. పాఠశాల విద్యార్థులు, యువతను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలి. మహమ్మద్ అజారుద్దీన్ సహా ప్రముఖ క్రీడాకారులతో విద్యార్థులకు ప్రేరణ కల్పించాలి. ఖేలో ఇండియా విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి’ అని సీఎస్ సంజయ్ జాజు అధికారులకు సూచనలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి...

ఈనెల 17న ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అధికారిక షెడ్యూల్ ఖరారు..

ఉద్యోగం కోసం మలేసియా వెళ్లి జైలుపాలైన కామారెడ్డి యువకుడు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 06:00 PM