మస్కట్.. నీలమణి
ABN , Publish Date - Nov 16 , 2026 | 03:55 AM
తెలంగాణలో డిసెంబరు 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 రాష్ట్ర క్రీడా చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనున్నాయని క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
ఖేలో ఇండియా మస్కట్ ఆవిష్కరణ
ఈ క్రీడల నిర్వహణకు తెలంగాణ నుంచి రూ.203 కోట్ల నిధులు
తెలంగాణ క్రీడా చరిత్రలో.. ఖేలో ఇండియా ఒక మైలురాయి
రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
లోగోను ఆవిష్కరించిన మాండవీయ
న్యూఢిల్లీ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో డిసెంబరు 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 రాష్ట్ర క్రీడా చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనున్నాయని క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈ పోటీల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.21 కోట్లకు తోడు రాష్ట్ర ప్రభుత్వం రూ.203.13 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈ నిధులతో పోటీల నిర్వహణతోపాటు రాష్ట్రంలోని స్ట్టేడియాల్లో శాశ్వత మౌలిక వసతులు కల్పించనున్నట్లు వెల్లడించారు.
శనివారం న్యూఢిల్లీలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లోగో, మస్కట్‌ను కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు వాకిటి శ్రీహరి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వాకిటి శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి పోటీల్లో మొత్తం 27 క్రీడాంశాలు ఉండగా, తెలంగాణ సంప్రదాయ క్రీడ కర్రసామును కూడా చేర్చినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 7వేల మందికి పైగా క్రీడాకారులు, 1,200 మంది కోచ్‌లు, సహాయక సిబ్బంది పాల్గొననున్నారని చెప్పారు. హైదరాబాద్‌తోపాటు హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్ వార్తలు
సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News