Share News

అటెండర్ మృతిపై కేసీఆర్ తీవ్ర విచారం.. కుటుంబానికి అండగా నిలవాలని సూచన

ABN , Publish Date - Nov 24 , 2026 | 04:02 PM

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన అటెండర్ మృతిపట్ల మాజీ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. అతడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

అటెండర్ మృతిపై కేసీఆర్ తీవ్ర విచారం.. కుటుంబానికి అండగా నిలవాలని సూచన
KCR Condolences

హైదరాబాద్, నవంబర్ 24: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన అటెండర్ మృతిపట్ల మాజీ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. అతడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నివాసంలో మణికుమార్ అనే వ్యక్తి అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం బంధనకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మణికుమార్ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే కేసీఆర్ దంపతులతో పాటు, మాజీ మంత్రి కేటీఆర్, ఆయన సతీమణి శైలిమ, కుటుంసభ్యులు విచారం వ్యక్తం చేశారు.


రోడ్డు ప్రమాదంలో మణికుమార్ చనిపోవడం ఎంతగానో కలిచివేసిందని కేసీఆర్ అన్నారు. మణికుమార్ తమ కుటుంబంలో ఒకడిగా కలిసిపోయాడని చెబుతూ... అతడి హఠాన్మరణంపై ఆవేదన చెందారు. మణికుమార్ కుటుంసభ్యులకు అండగా ఉంటామన్నారు. దగ్గరుండి మణి అంత్యక్రియలు నిర్వహించాలని మాజీ ఎంపీ సంతోష్ కుమార్, ముస్తాబాద్ మాజీ జడ్పీటీసీ శరత్‌రావుకు కేసీఆర్ సూచించారు.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు కేసు.. డిస్పోజబుల్ మెయిల్ ఐడీతో మెసేజ్

వికారాబాద్‌లో అగ్నిప్రమాదం.. ఇంట్లో సిలిండర్లు పేలినట్లు అనుమానం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 04:13 PM