రేవంత్ పాపాల చిట్టా బయటపెడతా
ABN , Publish Date - Sep 13 , 2026 | 05:55 AM
అధికారంలోకి రాక ముందు ఆర్టీఐని ఉపయోగించి, రియల్టర్లను బెదిరించిన రేవంత్‌రెడ్డి... సీఎం అయ్యాక తన కుటుంబ సభ్యులు, మంత్రివర్గ సహచరులతో కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
కమీషన్లు ఎందుకంటూ సీఎం ఏకపాత్రాభినయం
అధికారం ఉంటేనే బీఆర్‌ఎస్ నేతలు సభకు వస్తారా?
ప్రజలెందుకు ఓటేశారో ఆత్మపరిశీలన చేసుకోవాలి: కవిత
హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): అధికారంలోకి రాక ముందు ఆర్టీఐని ఉపయోగించి, రియల్టర్లను బెదిరించిన రేవంత్‌రెడ్డి... సీఎం అయ్యాక తన కుటుంబ సభ్యులు, మంత్రివర్గ సహచరులతో కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మూసీ సుందరీకరణ నుంచి ఇసుక విక్రయాల వరకు ప్రతి అంశంలో అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఈనెల 20న కొడంగల్‌లో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభ ద్వారా రేవంత్ పాపాల చిట్టాను బయట పెడతానన్నారు. ఈ మేరకు శనివా రం ఆమె ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 22 ఏ జాబితాను పొంగులేటికి, ఇరిగేషన్ ప్రాజెక్టులను ఉత్తమ్‌కు, ఇసుకను సీతక్కకు రాసిచ్చి, వారి ద్వారా సీఎం కమీషన్లు పొందుతున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి అసెంబ్లీలో తనకు కమీషన్లు ఎందుకంటూ ఏకపాత్రాభినయం చేస్తుంటే రాష్ట్రప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.
‘‘అధికారం ఉంటేనే బీఆర్‌ఎస్ నాయకులు అసెంబ్లీకి వస్తారా? అసెంబ్లీలో బీఆర్‌ఎస్ నేతలను సస్పెండ్ చేస్తే... కౌన్సిల్‌లో ఎందుకు మాట్లాడలేదు.. మండలిలో వాకౌట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజలు బీఆర్‌ఎ్‌సకు ఎందుకు ఓటు వేశారో ఆత్మ పరిశీలన చేసుకోవాలి’’ అని సూచించారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ గొప్పలు చెప్పుకుంటుంటే.. ఆ వ్యాఖ్యలను కౌంటర్ చేసే వాళ్లే సభలో లేకుండా పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. అధికార, ప్రతిపక్షాలు కలిసి పది నిమిషాలు పని చేస్తే లక్షలాది మంది సమస్యలు తీరతాయని, ఆ సోయి లేకుండా ప్రజాధనం దుర్వినియోగం చేశాయని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సిద్దిపేటలో నిషేధిత జాబితాలో ఉన్న వంద ఎకరాల భూమిని హరీశ్‌రావు తన తండ్రి, కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని, సీఎం రేవంత్‌కు దమ్ముంటే ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కొత్త ఐడీ కావాలంటే కాసులివ్వండి..!!
3 శాతం కమీషన్‌తో కోట్లు కొల్లగొట్టేస్తారు..!
Read Latest AP News And Telangana News And International News And Telugu News