Share News

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు గడువు పొడిగించాలి

ABN , Publish Date - Nov 03 , 2026 | 05:58 AM

ఎక్కువ మంది పట్టభద్రులు ఓటు నమోదు చేసుకునేలా.. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువును పొడిగించాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు.

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు గడువు పొడిగించాలి
Kalvakuntla Kavitha

  • సీఈవో సుదర్శన్‌రెడ్డికి కల్వకుంట్ల కవిత వినతి

హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఎక్కువ మంది పట్టభద్రులు ఓటు నమోదు చేసుకునేలా.. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువును పొడిగించాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. ఈ మేరకు సోమవారం సీఈవో కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డిని వినతిపత్రం అందజేశారు. గ్రాడ్యుయేట్‌ ఓటరు నమోదు గడువు ఈనెల 6తో ముగుస్తుందని.. అయితే, ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చి నామినేషన్ల ప్రక్రియ కొనసాగే వరకు ఓటరు నమోదుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. కొత్త పార్టీలు తమ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎమ్మెల్సీ ఎన్నికలు మంచి అవకాశమని పేర్కొన్నారు.


జెన్‌జీలు, గ్రాడ్యుయేట్లు ఈ ఎన్నికలను సీరియ్‌సగా తీసుకోవాలన్నారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి గ్రాడ్యుయేట్‌ ఓటరు నమోదు ప్రక్రియ చేపడుతుండటం.. పోటీ చేసే అభ్యర్థులకు తలకు మించిన భారంగా మారిందని.. ఈ ప్రక్రియలో మార్పు తీసుకురావాలని ఎన్నికల కమిషన్‌ను కోరామని అన్నారు. అలాగే, పెద్ద విద్యాసంస్థల యజమానులు తమ సంస్థల్లోనే భారీగా ఓటర్లను నమోదు చేయించుకుంటూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. వీటిపైనా సీఈవో దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.

పార్టీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు సహకరించండి

తమ ‘‘తెలంగాణ రక్షణ సేన’’ (టీఆర్‌ఎస్‌) పార్టీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పెండింగ్‌లో ఉందనే విషయాన్ని సీఈవో దృష్టికి తీసుకెళ్లినట్లు కవిత తెలిపారు. ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాడుతున్న తీరును కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక రూపంలో అందించి, రిజిస్ట్రేషన్‌ త్వరగా పూర్తయ్యేలా సహకరించాలని కోరినట్లు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌ మెట్రోకు రూ.275 కోట్లు

ట్రూ-అప్‌ భారం ప్రజలపైనే..

నేడు అతి భారీ వర్షాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 05:58 AM